అవతార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. ఈ ‘అవతార్‘ ఫ్రాంచైజీ నుంచి సినిమా వస్తుందంటే చాలా వరల్డ్ సినీ ఆడియన్స్ వెంటనే టికెట్స్ బుక్ చేసేస్తారు. అందుకు..అవతార్ ఫస్ట్ పార్ట్ ‘అవతార్’ 2009లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా అవతార్ నిలిచింది. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్‌లోని ఈ మూవీ మార్వెల్ సినిమాలకు పోటీ ఇచ్చి, మరీ…అప్పట్లో టాప్ ప్లేస్‌ని కైవసం చేసుకుంది.
ఆ తర్వాత ‘అవతార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘అవతార్ ద వే ఆఫ్ వాటర్’ సినిమా వచ్చినా, ‘అవతార్’ అంతటి భారీ హిట్‌ను అయితే సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు అవతార్ ఫ్రాంచైజీ నుంచి ‘అవతార్ 3’గా ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ (AvatarfireAndAsh) చిత్రం రాబోతుంది. ఈ వారం లోనే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారు. డిసెంబరు 19న ఈ సినిమా విడుదల అవుతుంది. ‘అవతార్’ సినిమా ఆకాశంలో ఫైట్ నేపథ్యంతో ఉంటుంది. ‘అవతార్’ రెండోపార్టు ‘అవతార్ ద వే ఆఫ్ వాటర్’ సినిమా, వాటర్ నేపథ్యంతో ఉంటుంది. మూడోపార్టు ‘అవతార్ యాష్ అండ్ ఫైర్’ సినిమా కంప్లీట్‌గా ఫైర్ నేపథ్యంలో ఉంటుంది. అవతార్ 3 (Avatar3)సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. తెలుగు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సో..అవతార్ సినిమా తెలుగు ట్రైలర్ కూడ వస్తుందని ఊహింవచ్చు.
చూస్తుంటే…పంచభూతాలపైన ‘గాలి, నీరు, ఆకాశం, నేల, నిప్పు’ల ఆధారంగా జేమ్స్‌కామెరూన్ (james Cameron) ఒక్కో అవతార్ సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘అవతార్’ సినిమా నుంచి మరో రెండు పార్టులు రావాల్సి ఉంది. ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…’అవతార్ 3, అవతార్ 4′ సినిమాలను ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ‘అవతార్ 5, అవతార్ 6′ సినిమాలు కూడా ఉంటాయి.
అవతార్ ఫ్రాంచైజీ నుంచి రాబోయే సినిమాలకు తాను దర్శకత్వం వహించాలనుకోవడం లేదని, వయసు రిత్యా సమస్యలు రావొచ్చని,
జేమ్స్ కామెరూన్ ఓ సందర్భంగా చెప్పారు. కాబట్టి…అవతార్ 5, అవతార్ 6’ సినిమాలకు కొత్త దర్శకులను చూడొచ్చు.