DaakuMaharaaj Review: డాకుమహారాజ్‌ రివ్యూ

వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న బాలకృష్ణకు, ఆయన తాజా చిత్రం ‘డాకు మహారాజ్‌’ రూపంలో మరో హిట్‌ అందుకున్నాడా? దర్శకుడు బాబీ ‘డాకు మహారాజ్‌’ కథను ఎలా డీల్‌ చేశాడు? రివ్యూలో చదవండి.

Viswa
3 Min Read

Web Stories

DaakuMaharaaj Review: మదనపల్లెలోని కృష్ణమూర్తి (సచిన్‌ ఖేడ్కర్‌) కాఫీ ఏస్టేట్‌ని లీజుకు తీసుకుని, ఈ ప్లేస్‌లో అక్రమ కార్య కాలపాలకు పాల్పడుతుంటాడు లోకల్‌ ఎమ్‌ఎల్‌ఏ త్రిమూ ర్తులు. దీంతో త్రిమూర్తులపై పోలీస్‌ కంప్లై ట్‌ ఇస్తాడు కృష్ణమూర్తి. దీంతో కృష్ణ మూర్తి మనవరాలు వైష్ణవిని చంపాలను కుంటాడు త్రిమూర్తులు. అదే సమయంలో కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా జాయిన్‌ అయిన నానాజీ (బాలకృష్ణ), త్రిమూర్తులు అనుచరుల నుంచి వైష్ణవీని కాపాడుతుంటాడు. అయితే త్రిమూర్తులను ఆపరేట్‌ చేసేది మధ్య ప్రదేశ్‌లో ఉన్న బల్వత్‌సింగ్‌ ఠాకూర్‌ (బాబీ డియోల్‌) అని తెలుసుకున్న నానాజీ ఏం చేస్తాడు? ఇరిగేషన్‌ ఆఫీసర్‌ సీతారామ్‌ ఎందుకు డాకుమహారాజ్‌గా మారాల్సి వచ్చింది? సీతారామ్‌ తన పేరును నానాజీగా మార్చుకుని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా ఎందుకు జాయిన్‌ అయ్యాడు? అన్నది కథ.

DaakuMaharaj Review

దర్శకుడు బాబీ (Bobby) సినిమాలన్నీ పక్కా కమర్షియల్‌గా ఉంటాయి. ‘పవర్, వాల్తేరువీరయ్య..’ ఇలాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు వచ్చిన ‘డాకు మహారాజ్‌’ కూడా ఇలాంటి పక్కా కమర్షి యల్‌ మూవీయే. పాపను కాపాడే సన్నివేశాలతో తొలిభాగం ముగస్తుంది. బల్వత్‌సింగ్‌ ఠాకూర్, అతని ఇద్దరు సోదరుల నుంచి చంబల్‌ ప్రాంత వాసులు పడే ఇబ్బందులు, వారికి అండగా నిలబడేం దుకు సీతారామ్‌ (బాలకృష్ణ) (Balakrishna), అతని భార్య కావేరీ (ప్రగ్యాజైస్వాల్‌), ఈ భార్య భర్తలను సపోర్ట్‌ చేసే కలెక్టర్‌ నందిని (శ్రద్ధాశ్రీనాథ్‌) సన్నివేశాలతో సెకండాఫ్‌ సాగుతుంది. ఓ ప్రభుత్వ నీటి పారుదల ఆఫీసర్‌ సీతారామ్‌గా చేయలేని పనిని, డాకుమహారాజ్‌గా మారి సీతారామ్‌ కంప్లీట్‌ చేయడంతో కథ ముగుస్తుంది.

Ramcharan GameChanger Movie Review: రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ మూవీ రివ్యూ

 

తొలిభాగం బాగానే ఉంటుంది. సెకండాఫ్‌ మాత్రం చాలా ల్యాగ్‌ ఉంది. ఠాకూర్‌ బ్రదర్స్‌ స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారి ఆడియన్స్‌కు సహన పరీక్షే. పైగా కథ చాలా రోటీన్‌గా ఉంటుంది. నెక్ట్స్‌ మూ మెంట్‌ ఆడియన్స్‌ ఊహించేలా ఉంటుంది. అయితే శ్రద్ధాశ్రీనాథ్‌ పాత్రలో ఉండే ఒకట్రెండు సీన్స్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉండొచ్చు. బాబీ డియోల్‌ ఎంట్రీ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. అయితే ప్రీ ఇంట్రవెల్‌కు ముందు అడవిలో వచ్చే ఫైట్, బాలకృష్ణ మార్క్‌ పంచ్‌ డైలాగ్స్‌…బాలయ్య ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. కామెడీ ట్రాక్‌ ఏం లేదు. తొలిభాగంలో ఉన్నా అది ఫోర్డ్స్‌గా అనిపిస్తుంది.

Daaku Maharaaj Dabidi dibidi Song Gets Trolling

సీతారామ్, డాకుమహారాజ్, నానాజీ…ఇలా మూడు వేరియేషన్స్‌ ఉన్న రోల్స్‌లో బాలకృష్ణ అత్య ద్భుతంగా నటించాడు. డాకుమహారాజ్, నానాజీగా బాలకృష్ణ స్క్రీన్‌పై కనిపించినప్పుడు సీన్స్‌ బాగుంటాయి.సీతారామ్‌గా ఉన్నప్పుడు మాత్రం ఆడియన్స్‌ కామ్‌గా ఉండిపోవాల్సిందే. బాలకృష్ణ
తర్వాత శ్రద్ధాశ్రీనాథ్‌కు మంచి రోల్‌ దక్కింది. ఈ పాత్ర వచ్చేది సెకండాఫ్‌లోనే కానీ…కథకు చాలా కీలకంగా ఉంటుంది. ప్రగ్యాజైస్వాల్, చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతెలాల రోల్స్‌ ఉన్నాయంటే ఉన్నాయన్నట్లుగా ఉంటాయి. బాబీ డియోల్‌ పాత్ర ప్రస్తావన కూడా సెకండాఫ్‌లోనే ఉంటుంది. బాలకృష్ణ పాత్ర ఎలివేషన్స్, బాబీ డియోల్‌ ఎలివేషన్స్‌పైనే కాకుండ కథను కొంత డిఫరెంట్‌గా ఇవ్వాలని, దర్శకుడు ప్రయత్నించి ఉంటే బాగుండేది. కమర్షియల్‌ అయినా, నాన్‌–కమర్షియల్‌ అయినా…కథలో బలం ఉంటేనే బాగుటుంది. మకరంద్‌దేశ్‌పాండే, సచిన్‌ఖేడ్కర్, అఖండ మెహతా వారి పాత్రల మేరకు వారు చేశారు. ఇక ఈ సినిమాకు మరో పిల్లర్‌లా నిలబడింది తమన్‌ మ్యూజిక్‌. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ అదరగొట్టాడు తమన్‌. విజయ్‌ కార్తీక్‌ విజువల్స్‌ బాగున్నాయి. ఎడిటర్‌ నిరంజన్‌ సెకండాఫ్‌లో ఇంకొంచెం కట్‌ చేయాల్సింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ తగ్గ నిర్మాణ విలువలు స్క్రీన్‌పై కనిపించాయి.

బాటమ్‌లైన్స్‌: కథ పరంగా చాలా ఓల్డ్‌ కమర్షియల్‌ టెంప్లెట్‌ మూవీ. బాలకృష్ణ మార్క్‌ యాక్షన్, డైలాగ్స్‌ను ఇష్టపడేవారికి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. సెకండాఫ్‌లో కాస్త ఓపిగ్గా సినిమా చూడాలి.

రేటింగ్‌: 2.25/5

 

 

Please Share
7 Comments
Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos