Balakrishna movies: తమిళ దర్శకుడితో బాలకృష్ణ

Viswa
1 Min Read
Balakrishna movies: తమిళ దర్శకుడితో బాలకృష్ణ

అధిక్‌ రవిచంద్రన్‌….తమిళంలో ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమా తీసి, హిట్‌ కొట్టాడీ డైరెక్టర్‌. నెక్ట్స్‌ వెంటనే..అజిత్‌తో ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’ సినిమా తీసి తమిళంలో మరో హిట్‌ అందుకున్నాడు. ముఖ్యంగా ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’ సినిమాలో అజిత్‌ను అధిక్‌ ప్రజెంట్‌ చేసిన తీరుకి, మాస్‌ సీన్స్‌కి అజిత్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.

అయితే ఈ తరహా మాస్‌ ఫిల్మ్స్‌ను తీసే ఈ దర్శకుడితో బాలకృష్ణ (Balakrishna movies) ఓ మూవీ చేయనున్నారనే టాక్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో ఊపందుకుంది. ఇటీవల బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను అధిక్‌ కలిసి, ఓ కథ చెప్పారని, ఆ కథ బాలయ్యకు నచ్చిందని, వీరి కాంబినేషన్‌లో మూవీ ఉంటుందన్నది టాక్‌. ప్రస్తుతం దర్శకుడు బోయపాటితో బాలకృష్ణ ‘అఖండ 2’ తీస్తున్నాడు. ఈ మూవీ తర్వాత తనతో వీరసింహారెడ్డి మూవీ తీసిన గోపీచంద్‌ మలినేనితో మరో మూవీ చేస్తాడు బాలకృష్ణ. ఆ నెక్ట్స్‌ కానీ..అధిక్‌ రవిచంద్రన్‌తో బాలకృష్ణ సినిమా ఉండొచ్చు. జూన్‌ 10న బాలకృష్ణ బర్త్‌ డే. ఈ సందర్భంగా బాలకృష్ణ కొత్త సినిమాలను గురించే అప్‌డేట్స్‌లో, అధిక్‌తో సినిమా ఉంటు ందా? అనేది చూడాలి. ఇంకా..రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ మూవీలో బాలకృష్ణ ఓ రోల్‌ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంపై కూడా ఓ స్పష్టత రావాల్సి ఉంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *