Kishkindhapuri First Review: హారర్ కామెడీ నేపథ్యంతో తెలుగులో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రేక్షకులూ ఆదరించారు. కానీ సీరియస్ హారర్ కామెడీ ఉన్న సినిమా లూ చాలా తక్కువగా వచ్చాయి. ఒకప్పుడు రామ్‌గోపాల్‌వర్మ ‘దెయ్యం’, ‘తులసీదళం’, రాజేంద్రప్రసాద్ ‘కాష్మోరా’, జగపతి బాబు చేసిన ‘రక్ష’ వంటి సినిమాలు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్‌లో ‘తంత్ర, పొలిమేర, మసూధ’ వంటి సినిమాలను చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కాస్త సీరియస్ హారర్ చిత్రంగా ‘కష్కింధపురి’ సినిమా రాబోతుంది. గత చిత్రాల మాదిరి ఇందులో బ్లాక్‌మ్యాజిక్ గట్రా, అవీ ఇవీ ఉండక పోవచ్చని రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
కిష్కింధపురి అనే ఊర్లో జరిగే కల్పిత కథ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri First Review) సినిమా. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమపరమేశ్వరన్ (Anupama Parameswaran)లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ హారర్ ఫిల్మ్‌తో కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘కిష్కింధపురి’ అనే ఊర్లో ఉన్న రేడియోస్టేషన్ బిల్డింగ్ సువర్ణమాయ నేపథ్యంతో ఈ కిష్కింధపురి సినిమా ప్రధాన కథాంశం సాగుతుంది. మొదటి పావుగంట కాస్త సినిమా స్లోగా స్టారై్టనా, ఆ తర్వాత ఆడియన్స్‌ను పూర్తిగా ఎంగేజ్ చేస్తుందట. సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్, ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తారట. ముఖ్యంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమపరమేశ్వరన్ క్యారెక్టర్‌లోని డిఫరెంట్ షేడ్స్ స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారట. అసలు..సువర్ణమాయ బిల్డింగ్‌లో ఏం జరిగింది? రెడియో నుంచి వచ్చే వాయిస్ ఎవరిది? రెడియోలోకి దెయ్యం ఎలా వెళ్లింది? అన్న పాయింట్స్ ఈసినిమాలో చాలా ఆసక్తికరంగా ఉండేలా డిజైన్ చేశారట దర్శకుడు కౌశిక్ (Koushik Pegallapati). అలాగే ట్రైలర్ చివర్లో అనుపమ దెయ్యంలా కనిపించే సీన్స్ ఈ సినిమాకు ఓ మేజర్ హైలైట్ అని, ఓ బస్ యాక్సిడెంట్ కీలకగా ఉండబోతుందనే టాక్‌లు వినిపిస్తున్నాయి (Kishkindhapuri Review)
ఈ కిష్కింధపురి సినిమాకు దాదాపు రూ. 40 కోట్ల రూపాయాలను ఖర్చు చేశారు మేకర్స్. సువర్ణమాయ సెట్స్ కోసం రెండు కోట్ల రూపాయాలతో, నెల రోజులు శ్రమించి సెట్స్ వేశారు. సాహుగారపాటి ఈ సినిమాను నిర్మించాడు. ఇక రాక్షసుడు వంటి హిట్ ఫిల్మ్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమాపరమేశ్వరన్‌లు కలిసి ఈ సినిమాలో నటించారు. ఇక హారర్ సినిమాలకు మంచి ఆర్‌ఆర్ అవసరం. చైతన్ భరద్వాజ్ మంచి ఆర్‌ఆర్ ఇచ్చాడు. ఈ ఆర్‌ఆర్ హారర్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేస్తుందట. ఇక ఈ సినిమాకు మరో ప్రధానబలం ఏంటంటే…నిడివి. ఈ సినిమా నిడివి కేవలం రెండుగంటల పది నిమిషాలే ఉంటుంది. ఆడియన్స్‌కు పెద్దబోర్‌గా అనిపించదట. సినిమా మొదలైన, పది నిమిషాల తర్వాత థియేటర్స్‌లో ఉన్న ఆడియన్స్ ఎవరైనా మొబైల్‌ఫోన్స్ చూస్తే, ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చెబుతున్నారు. అంటే…కిష్కింధపురి సినిమాపై టీమ్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థం అవుతుంది. మరి..వీరి అంచనాలను పట్ల ఆడియన్స్ నిర్ణయాలు, జడ్జిమెంట్ ఎలా ఉంటుందనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఈ సినిమా ఈ సెప్టెంబరు 12న విడుదల అవుతోంది.