సినిమా: భైరవం (Bhairavam Movie Review)
ప్రధాన తారాగణం: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై
దర్శకుడు: విజయ్‌కనకమేడల
నిర్మాతలు: జయంతిలాల్ గడా, కేకే రాధామోహన్
కెమెరా: హరి కె. వేదాంత్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: చోటా కె ప్రసాద్
విడుదల తేదీ: మే 30, 2025
నిడివి: 2 గంటల 35 నిమిషాలు
రేటింగ్ 2.5/5
Bhairavam Movie Story:కథ
తూర్పు గోదావరి జిల్లా దేవీపురంలోని వారాహి అమ్మవారి దేవుడి మాన్యం 75 ఏకరాల భూమి ఉంటుంది. ఈ భూమిని సొంతం చేసుకునేందుకు దేవదాయశాఖ మంత్రి మినిస్టర్ విధురపల్లి (శరత్), తన సమీప బంధువు అయిన నాగారాజు (అజయ్)తో కలిసి ప్లాన్ చేస్తుంటాడు (Bhairavam Movie Telugu Review)
మరోవైపు అదే దేవీపురంలో ట్రాన్స్‌ఫోర్ట్ బిజినెస్ చేసే వరద (నారా రోహిత్), జమీందారు వంశస్థుడు గజపతివర్మ (మంచు మనోజ్), గజపతివర్మ దగ్గర పనిచేసే శ్రీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)…ముగ్గురు మంచి స్నేహితులు. గజపతివర్మ నాన్నమ్మ నాగరత్నమ్మ (జయ సుధ) వారాహి అమ్మవారి దేవాలయం ధర్మకర్తగా ఉంటారు. మినిస్టర్ విధురపల్లి తన పని కోసం లోకల్ పోలీసాఫీసర్ పార్ధసారధి (సంపత్‌నంది)నా వాడుకుంటుంటాడు. అ యితే సడన్‌గా నాగరత్నమ్మ చనిపోతుంది. ఆలయధర్మకర్త కావాలని నాగారాజు విఫలప్రయత్నం చేస్తాడు. ఇక లాభం లేదని గజపతివర్మతో 40 కోట్ల రూపాయాల డీల్ మాట్లాడతాడు మినిస్టర్. మరి..ఈ డీల్‌కు గజపతివర్మ ఒప్పు కున్నాడా? ముగ్గురు స్నేహితులు వరద, గజపతి, శ్రీనుల మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి? నాగరత్నమ్మను చంపింది ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానాలను థియేటర్స్‌లోనే చూడాలి.
విశ్లేషణ
‘మన వాళ్ళను మనమే చంపుకునే మహాభారత యుద్ధం మన మధ్య జరుగుతుందని నేను ఊహించలేదు’ అంటూ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చెప్పిన డైలాగ్ ఈ సినిమా ట్రైలర్‌లో వినిపిస్తుంది. సింపుల్ కథ మొత్తం ఇదే. ముగ్గురు స్నేహితులు, వాళ్ల కుటుంబ జీవితాలు, ఆర్థిక అవసరాల కోసం చేసే తప్పులు..ఇలాంటి ఆసక్తికరమైన అంశాల చుట్టూ ‘భైరవం’ సినిమా కథ సాగుతుంది.
పోలీసాఫీసర్ పార్థసారధి నరేషన్‌తో సినిమా కథంతా నడుస్తుంటుంది. సినిమా ప్రారంభమైన మొదట్లో కాస్త స్లోగానే ఉంటుంది. ముగ్గురు హీరోల రోటన్ ఇంట్రడక్షన్‌లతో సాదాసీదాగా సాగ తుంది. కానీ ఇరవై నిమిషాలు దాటిన తర్వాత ఈ సినిమా అసలు కథ మొదలవుతుంది. ఆసక్తిక రమైన సన్నివేశాలతో సాగుతుంది. ఓ భారీ జాతర ఎపిసోడ్‌తో ఇంట్రవెల్ వస్తుంది. ఈ ఇంట్ర వెల్ యాక్షన్ సీక్వెన్స్ ఫర్వాలేదనిపిస్తోంది. కానీ సెకండాఫ్‌లో కొంచెం డ్రామా తగ్గి, యాక్షన్ మోతాదు ఎక్కువతుంది. దీంతో ఫస్టాఫ్‌లో ఉన్న నాటకీయత సెకండాఫ్‌లో లేదెమో అనిపిస్తుం ది. కానీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ ట్విస్ట్ ఒకే.
తమిళ హిట్ ‘గరుడన్’ రీమేక్‌ను ఉన్నంతలో బాగానే తీశాడు దర్శకుడు విజయ్ కనకమేడల. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లుగా కొన్ని మార్పులైతే చేశాడు. కానీ కొన్నిచోట్ల కాస్త ఎక్కువగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. సినిమాలోని ఒకట్రెండు క్యారెక్టర్స్ సడన్‌గా మాయమైపోతాయి. ఉదాహరణకు గోపరాజు పాత్ర. ఇంకా క్లైమాక్స్ కన్‌క్లూజన్ కూడా ఏదో చూట్టేసినట్లుగా ఉంటుంది. మినిస్టర్‌ను చంపడం అనేది ఒకేషాట్‌లో చూపించడం నప్పలేదు. వరద–గజపతిల మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ పెట్టిన దర్శకుడు, శ్రీను–గజపతిల మధ్య అలాంటి సీన్స్ ఎక్కువగా లేవు. మొత్తంగా మాస్ ఆడియన్స్‌ను భైరవం సినిమా శాటిస్‌ఫై చేస్తుంది.
Bhairavam Movie Cast and Crew:నటీనటులు-సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్
శ్రీనుగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Bhiravam hero BellamkondasaiSrinivas) ఫర్వాలేదనిపించాడు. జాతర సీక్వెన్స్ ఫైట్, తోటలో ఫైట్, క్లైమాక్స్ ఫైట్‌లో తన యాక్షన్ ఈజ్ చూపించాడు. ఒకట్రెండు సీన్స్‌లో ఎమోషన్ కూడా పండిం చాడు. నటుడిగా కాస్త పరిణితి చెందాడు. ఇక వరద పాత్రలో నారా రోహిత్ (NaraRohith) సెటిల్డ్ మాస్ యాక్ష న్ రోల్ చేశాడు. నారా రోహిత్ నటన మెప్పిస్తుంది. తొలిభాగంలో నారా రోహిత్‌యే హీరోనా? అనిపిస్తుంది. ఇక గజపతి పాత్రలో మంచు మనోజ్ మంచి నటన కనబరచారు. నారా రోహిత్ (Bhiravam ManchuManoj)తో మనోజ్‌కు మంచి కాంబినేషన్ సీన్స్ పడ్డాయి. అప్పటివరకు పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ పాత్ర క్లైమాక్స్‌లో తేలిపోతుంది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కు జోడీగా వెన్నెల పాత్రలో అతిది శంకర్ (Bhairavam movie heroine) మంచి నటన కనబర చారు. కానీ కథలో ఈ పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. నారా రోహిత్ భార్య పూర్ణిమగా దివ్యా పిళ్లై సినిమాలో వెయిట్ ఉన్న క్యారెక్టర్ దక్కింది. కానీ ఈ పవర్ సెకండాఫ్‌లో కొంత వరకు మాత్రమే పరిమితమైంది. ఇక మంచు మనోజ్ భార్య నీలిమగా ఆనందికి కథలో కీలక పాత్ర దక్కింది. నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి.
విజయ్ కనకమేడల డైరెక్షన్ (Bhairavam Director Vijaykanakamedala) ఒకే. ముగ్గురు హీరోల పాత్రలను బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ కథలో మహిళల పాత్రల ఎమోషన్, డెప్త్, స్క్రీన్ ప్రెజెన్స్ వంటి అంశాలో ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. కమర్షియల్‌గా స్క్రీన్ ప్లే ఒకే. పోలీస్ కానిస్టేబుల్‌గా వెన్నెల కిశోర్ కామెడీ వర్కౌట్ కాలేదు. నాగరాజుగా అజయ్, గోజరాజు రమణ, పోలీస్ ఆఫీసర్ ఎస్‌ఐగా సంపత్‌నంది, సందీప్ రాజ్ వారి వారి పాత్రల మేరకు చేశారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, ఆర్‌ఆర్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. రాధామోహన్ ఖర్చు వెండితెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు.
బాటమ్‌లైన్: మాస్ భైరవం