please subscribe to Tollywoodhub YouTube channel

అది నా జీవితంలో చాలా ప్రత్యేకం.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన సార అర్జున్..!

Kumar NA

Web Stories

Sara Arjun : బాలీవుడ్‌లో కొత్త స్టార్‌గా మారిన సారా అర్జున్ తన మొదటి సినిమా ‘ధురంధర్’తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చి, థియేటర్లలో మంచి కలెక్షన్లు కూడా సాధించింది. దీంతో సారా ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోయింది.
ఇప్పుడు ఆమె తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతోంది. సారా నటించిన కొత్త సినిమా ‘యుఫోరియా’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వం వహించారు.

ఇది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో యువతలో పెరుగుతున్న డ్రగ్స్ అలవాట్లు, తగ్గిపోతున్న సామాజిక విలువల గురించి చూపిస్తారు. ఇందులో భూమిక చావ్లా, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా ప్రచారంలో భాగంగా సారా తన అనుభవాలను పంచుకుంది. ‘ధురంధర్’ సినిమా చూసిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏమన్నారు అని అడిగితే, “ఆ సినిమా చూసి నా అమ్మా నాన్న చాలా ఆనందపడ్డారు. వారి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి.

ఆ రోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది” అని చెప్పింది. తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత తాను బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లానని, తర్వాత నటనలో ఇంకా మెరుగుపడాలని విదేశాలకు వెళ్లాలని అనుకున్నానని చెప్పింది. కానీ ఆ సమయంలోనే ‘మ్యాజిక్’ సినిమా అవకాశం వచ్చింది. తర్వాత ‘యుఫోరియా’ కథ తనకు బాగా నచ్చడంతో దానిని చేయడానికి ఒప్పుకున్నానని సారా తెలిపింది.

Please Share
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi