మయసభ ఫేమ్‌ చైతన్యారావు కొత్త చిత్రం ప్రారంభం

SPM
SPM

Web Stories

Chaitanya Rao Next Movie: ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్‌ఫేమస్‌ లవర్, ఓనమాలు’ వంటి సినిమాలతో దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న కాంతిమాధవ్‌ లేటెస్ట్‌ మూవీ ఖరారైంది. ఇటీవల వచ్చిన ‘మయసభ, ఘాటీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరరైన, యువ నటుడు చైతన్యారావు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఐరా, సాకీ ఈ చిత్రంలోని హీరోయిన్‌ రోల్స్‌ చేస్తున్నారు. శ్రేయాస్‌ చిత్ర పతాకంపై పూర్ణ నాయుడు, వి.శ్రీకాంత్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.

Chaitanya Rao New Movie Directed by Sensible Filmmaker Kranthi Madhav

ఈ వేడుకలో క్రాంతి మధవ్‌ మాట్లాడుతూ–‘‘న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌ ఇది. చైతన్య, పూర్ణగార్లతో నాకు ఎప్పట్నుంచో మంచి అనుబంధం ఉంది’’ అని తెలిపారు.

‘‘న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ’ అని క్రాంతిమధవ్‌ ఉన్న చెప్పిన ఈ స్టోరీ నాకు ఎంతగానో నచ్చింది. ‘ఘాటీ, మయసభ’ల తర్వాత, ఈ సినిమా చేసే అవకాశం రావడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు చైతన్యారావు

‘‘క్రాంతిమాధవ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఓ సినిమా చేయాలనుకున్న..కానీ ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నా. నా ప్రతి ప్రాజెక్ట్‌లోనూ శ్రీకాంత్‌ భాగస్వామిగా ఉంటుంటాడు’’ అని మాట్లాడారు పూర్ణ.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos