సినిమా: చౌర్యపాఠం (Chauryapaatam movie review)
ప్రధానతారాగణం: ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి
దర్శకత్వం: నిఖిల్ గొల్లమారి
నిర్మాత: నక్కిన త్రినాథరావు
ఎడిటర్: ఉత్తర
సంగీతం: దావ్ జాంద్
కెమెరా: కార్తీక్ ఘట్టమనేని
విడుదల తేదీ: 25 ఏప్రిల్ 2025
నిడివి: 2 గంటల 4 నిమిషాలు
రేటింగ్:2.5/5.0
కథ
వేదాంత్ రామ్ (ఇంద్ర రామ్) అసిస్టెంట్ డైరెక్టర్. తాను వర్క్ చేస్తున్న సినిమా సెట్స్‌లో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ సినిమా నిర్మాత నష్టపోతాడు. దీంతో వేదాంత్ రామ్‌కు దర్శకుడిగా ఇండస్ట్రీలో అవకాశాలు రావు. చేసేదీ ఏం లేక తానే సొంతంగా సినిమా తీయాలనుకుంటాడు. ఇందుకు డబ్బు కావాలి. దీంతో «ధనిక గ్రామమైన ధనిపాలికి వెళ్లి, అక్కడ బ్యాంకు రాబరీ ప్లాన్ చేస్తాడు ఇంద్రరామ్. అలాగే ఈ బ్యాంకు అకౌంటెంట్ అజంలి (పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమలో పడతాడు వేదాంత్‌రామ్. ధనిపాలి గ్రామంలో ఉన్న స్కూల్లో నివాసం ఉంటూ, బ్యాంకు రాబరీకి ప్లాన్ చేస్తాడు. తన స్నేహితులు లక్ష్మణ్ (మ్యాడీ), బబ్లూ (సలీం), జాక్‌లతో కలిసి స్కూల్ నుంచి బ్యాంకుకు ఓ సోరంగం తవ్వుతాడు.కానీ… ఈ సొరంగం తవ్వే క్రమంలో వేదాంత్ రామ్– అతని స్నేహితులకు అస్థిపంజరాలు కనిపిస్తాయి. అసలు..ఆ అస్థిపంజరాలు ఎవరివి? ఆ ఊరి సర్పంచ్ వసుధ (సుప్రియ ఐసోలా)కు, ఈ ఊరి జమీందార్ (రాజీవ్ కనకాల) ఉన్న గొడవలు ఏమిటి? అన్నదే ఈ సినిమా కథనం.
విశ్లేషణ
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కథతో ఈ చౌర్యపాఠం సినిమా తీశారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీశారు. కొంత కాల్పనికత యాడ్ చేశారు. హీరో– అతని స్నేహితులు గ్రామానికి వెళ్లేంత వరకు సినిమా స్లోగా సాగుతుంది. ఆ తర్వాత లవ్‌ట్రాక్ కూడా కాస్త బోరింగ్‌గా ఉంటుంది. కానీ సొరంగంలో ఆస్థిపంజరాలు కనిపించే ట్విస్ట్‌తో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ఆడియన్స్‌లో క్రియేట్ అవుతుంది. క్లైమాక్స్‌ను కొత్తగా తీశారు. ఫర్వాలేదనిపిస్తుంది. ఒకట్రెండు పాటలు సినిమా ఫ్లోకి స్పీడ్ బ్రేకర్స్ వేస్తాయి. కామెడీ ఫర్వాలేదు. ఇంకాస్త బాగుంటే ఇంకా బాగుండేది. క్లైమాక్స్, సినిమా స్టార్టింగ్ టేకింగ్, ఇంట్రవెల్ ట్విస్ట్‌లు వర్కౌటైనట్లు…స్టోరీలో డ్రామా, కామెడీ కూడా ఉంటే సినిమా ఇంకా బాగుండేది.
ఎవరు ఎలా చేశారు?
కొత్త కుర్రాడు ఇంద్ర రామ్ మంచి యాక్టింగ్ కనబరచాడు. ఇంట్రవెల్, క్లైమాక్స్ సీన్స్‌లో మెప్పించాడు. పాయల్ రాధాకృష్ణ ఫర్వాలేదు. లేడీ సర్పంచ్‌గా సుప్రియ, రాజీవ్ కనకాలలకు మంచి రోల్స్ దక్కాయి. మ్యూజిక్ పరంగా దావ్ జాంద్ ఒకే. నేపథ్య సంగీతం బాగుంది. కార్తీక్ ఘట్టమనేని స్టోరీ, దర్శకుడు నిఖిల్ ఫర్వాలేదు. ఇక..ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ల ప్రతిభను మెచ్చుకుని తీరాలి. ముఖ్యంగా టన్నల్ విషయంలో వారి కష్టం కనిపిస్తుంది. టెక్నికల్‌గా బాగా తీశారు. దర్శకుడు నక్కిన త్రినాథరావు నిర్మాతగా పాస్ అయ్యారు. దర్శకుడిగా నిఖిల్ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు.
బాటమ్‌లైన్: ఎంటర్‌టైనింగ్ పాఠం