చిరంజీవి, అనిల్‌రావిపూడి కాంబోపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు (Chiranjeevi 157) ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత అనిల్‌రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా ఈ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమా ప్రారంభోత్సవానికి అతిథులుగా హాజరైయ్యారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్
షూటింగ్ ప్రారంభం కానుంది. చిరంజీవి కెరీర్‌లోని ఈ 157వ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పనిచేసిన భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సాహుగారపాటి, చిరంజీవి పెద్ద కుమార్తె సాహూ గారపాటి ఈ సినిమాను నిర్మిస్తారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఓ సారి అనిల్‌రావిపూడి డైరెక్షన్‌లోని సినిమాలను గమనిస్తే…హీరో కచ్చితంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో ఏదు ఒక విధంగా కనెకై్ట ఉంటాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో కూడా హీరో ఎక్స్ పోలీసాఫీసర్. అయితే చిరంజీవిని కూడా పోలీస్ ఆఫీసర్‌గా చూపించనున్నారట అనిల్ రావిపూడి. ఈ సినిమాలో చిరం జీవి పోలీసాఫీసర్ లేదా రా (రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.
అలాగే ఈ మూవీలో వెంకటేష్ కూడా ఓ రోల్ చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే అది లీడ్ రోలా? లేకా? గెస్ట్ రోలా? అనేది తెలియాలి. హీరోయిన్‌గా అదితీరావ్ హైదరీ, సోనాక్షీ సిన్హా, పరిణీతి చోప్రా వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సో…అయితే చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాను కూడా 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే ‘విశ్వంభర’ సినిమా సంక్రాంతికి విడుదల కాలేదు. వీఎఫ్‌ఎక్స్ కారణంగా వాయిదా పడిందనే టాక్ వినిపించింది. ‘విశ్వంభర’ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
ఇంకా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ మూవీ కమిటై అయ్యారు. దర్శకుడు బాబీ, సందీప్‌రెడ్డివంగా వంటి వారితో సినిమాలు చేయవచ్చనే ప్రచారం సాగుతోంది.