మన శంకరవరప్రసాద్‌గారు ..పండక్కి వస్తారు!

Viswa
ManaShankaraVaraprasadGaru

చిరంజీవి హీరోగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ (ManaShankaraVaraprasadGaru)అనే టైటిల్‌ ఖరారైంది. ‘పండక్కి వస్తున్నారు’ అనేది క్యాప్షన్‌. చిరంజీవి కెరీర్‌లోని ఈ 157వ సినిమాను ఆయన పెద్ద కుమార్తె సుష్మితా కొణిదెలతో కలిసి సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం చిరంజీవి 70వ బర్త్‌ డే సందర్బంగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ టైటిల్‌ గ్లింప్స్‌లో వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌తో ఉండటం విశేషం. అలాగే ఈ సినిమాలో వెంకటేశ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, క్యాథీరన్‌, వీటీవీ గణేష్‌ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

ఇప్పటికే ఈ సినిమా (ManaShankaraVaraprasadGaru) చిత్రీకరణ 30 శాతం పూర్తయింది. ఈ సినిమాలో చిరంజీవి- నయనతారలు భార్యభర్తలుగా నటిస్తారు. ఈ ఆగస్టు 5 నుంచి’మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడింది. అయితే ఈ శుక్రవారం నుంచి సినీ కార్మికుల సమ్మె కూడా పూర్తి కావడంతో, అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణప్రారంభం అవుతుంది. ప్రస్తుతం బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా చిరంజీవి గోవాలో ఉన్నారు. గోవా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో స్వరకర్త.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *