చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. కునాల్ కపూర్ విలన్‌గా కనిపిస్తారు. వశిష్ఠ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. లేటెస్ట్‌గా ఈ మూవీ నుంచి ‘రామ రామ ’ (Chiranjeevi Vishwambhara Ramarama Song) సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సాంగ్‌ను విడుదల చేశారు. కీరవాణి స్వరకల్పనలో రామజోగయ్యశాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు.
‘రామ రామ రామ రామ ..రామ రామ రామ రామ..
శివుని ధనుస్సు వంచినోడు…శ్రీరామ్
రావణ మదము తెంచినోడు..శ్రీరామ్
ధర్మము విలువ పెంచినోడు..దశరథ సుతుడు…’
తయ్యతక్క తకథిమి చెక్కభజనలాడి .. రాములోరి గొప్ప చెప్పుకుందామా…
అంటూ మంచి లిరిక్స్‌తో ఈ సాంగ్ ఆడియన్స్‌ను అలరించేలా ఉంది.
విశ్వంభర మూవీని ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ విడుదల కాలేదు. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం, కొంత రీ షూట్స్ చేయాల్సిరావడం..వంటి కారణాల వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా జూలై 24న ‘విశ్వంభర’ సినిమాను రిలీజ్
చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జూలై 24 అంటే..చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా విడుదలైంది ఈ తేదీనే.
మరి..అనుకున్నట్లుగా ‘విశ్వంభర’ జూలై 24న రిలీజ్ అవుతుందా? అంటే…అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
పంచభూతాలపైన గాలి,నీరు, ఆకాశం, భూమి, నిప్పు…అంశాలపై ఈ మూవీ కథనం ఉంటుందని తెలిసింది. ఇందులో ఆంజనేయస్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారు.
చిరంజీవికి కథలో ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఉంటారు. ఇషా చావ్లా, రమ్య పసుపులేటిలు ఇందులో
చిరంజీవి సిస్టర్స్‌గా కనిపిస్తారు.