కథ మళ్లీ మొదటికొచ్చింది!

Viswa
2 Min Read

‘పుష్ప2’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత అల్లు అర్జున్‌ (AlluArjun) నెక్ట్స్‌ మూవీ (AlluArjun Next film )పై ఇంకా కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ ఫిల్మ్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ (trivikram)తో ఉంటుందని నిన్న మొన్నటివరకూ ఇండస్ట్రీలో ప్రచా రం సాగింది. కానీ ఇప్పుడు మళ్లీ తమిళ దర్శకుడు అట్లీ పేరు తెరపైకి వచ్చింది.

నిజానికి అట్లీ(Atlee)తో సినిమా చేయాలని అల్లు అర్జున్‌ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. గత ఏడాది లోనే వీరి కాంబినేషన్‌లో మూవీ అనౌన్స్‌మెంట్‌ రావాల్సింది. కానీ కుదర్లేదు. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్న టాక్‌ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. గత వారం అల్లు అర్జున్‌ను కలిసి కొన్ని విషయాలపై చర్చించారట అట్లీ అండ్‌ టీమ్‌.

హిందీలో షారుక్‌ఖాన్‌తో ‘జవాను’ తీసి, రూ. వెయ్యికోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించారు అట్లీ. ఇటు…‘పుష్ప 2’తో కేవలం హిందీలోనే రూ. 800 కోట్ల సాధించి, సన్సేషన్‌ క్రియేట్‌ చేశారు అల్లు అర్జున్‌. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ అంటే మాత్రం మార్కెట్‌ పరంగా, క్రేజ్‌ పరంగా నెక్ట్స్‌ లెవల్‌ అనే చెప్పొచ్చు.

సాయిరామ్‌శంకర్‌ ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ

కానీ అట్లీ సినిమాను అల్లు అర్జున్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తాడనే విషయంపై మాత్రం స్పష్టత రావడం లేదు. అట్లీ కూడా సల్మాన్‌ఖాన్‌తో ఓ మూవీ చేయాలనుకుంటున్నాడు. కానీ ఇది మల్టీస్టారర్‌ మూవీ. దీంతో మరో హీ రో సరిగ్గా సెట్‌ కావడం లేదు. రజనీకాంత్, కమల్‌హాసన్‌ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ అయితే రావడం లేదు. దీంతో అట్లీ అల్లుర్జున్‌కు షిఫ్ట్‌ అయినట్లు తెలుస్తుంది.

నా పేరు మార్చండి…వాళ్లు నన్ను రిజెక్ట్‌ చేశారు మన్మథుడు హీరోయిన్‌ అన్షుసాగర్‌

ఇదే నిజమైతే అల్లు అర్జున్‌తో మూవీ చేసేందుకు త్రివిక్రమ్‌ మరికొన్ని రోజులు వెయిట్‌ చేయకతప్పదు. అలా అని అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీ అట్లీతోనే అని కన్ఫార్మ్‌గా చెప్పలేం. ఎందుకంటే..ఇటీవలే బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలాభన్సాలీని కలిసొచ్చాడు అల్లు అర్జున్‌…..అట్లీ, త్రివిక్రమ్‌…సంజయ్‌లీలాభన్సాలీ… ఇలా ముగ్గురు దర్శకులు లైన్లో ఉన్నారు అల్లు అర్జున్‌ కోసం. ఇలా..అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీపై కథ మళ్లీ
మొదటికొచ్చింది.

నాగచైతన్య-సాయిపల్లవిల ఎమోషనల్‌ లవ్‌స్టోరీ మూవీ తండేల్‌ రివ్యూ

అర్జున్‌రెడ్డి, యానిమల్‌ సినిమాలు తీసిన సందీప్‌రెడ్డి వంగాతో కూడా అల్లు అర్జున్‌ ఓ మూవీ కమిటై య్యాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఈ మూవీ స్టార్ట్‌ కావడానికి చాలా సమయం ఉంది.

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *