ధనుష్ (Danush New Movie) హీరోగా తెలుగులో చేసిన ‘సార్’ (Sir) (తమిళంలో ‘వాతి) మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. సితార ఎంటర్‌టై న్మెంట్స్ (Sithara Entertainments) నిర్మించిన ఈ మూవీకి, సితార ఆస్థాన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. అయితే వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీ కూడా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే ((Sithara Entertainments) రూపుదిద్దుకోనుంది.
అయితే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా చేయనున్నారని, ముంబైలో సూర్యకు వెంకీ అట్లూరి– నిర్మాత నాగవంశీ ఓ కథను వినిపించారనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా కథ ఏమైందో ఏమో కానీ… సడన్‌గా ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ధనుష్ మరో సినిమా చేయ నున్నాడని, ఈ సినిమాకు హానెస్ట్ రాజా అనే టైటిల్ అనుకుంటున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో విని స్తోంది.
వెంకీ అట్లూరి (Venkey Atluri) తో ధనుష్ (Dhanush) చేసిన ‘సార్’మూవీ సూపర్‌హిట్. ఆ తర్వాత« దుల్కర్‌సల్మాన్‌తో వెంకీ అట్లూరి చేసిన ‘లక్కీభాస్కర్’ బ్లాక్‌బస్టర్. దీంతో ధనుష్ కూడా వెంకీ అట్లూరితో మూవీ చేయాలనుకుంటున్నాడు.సో..వీరి కాంబినేషన్‌లోని సినిమా ఆల్మోస్ట్ ఖరారైపోవచ్చని తెలుస్తోంది.
Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్ సూక్ష్మదర్శని రివ్యూ
ఇంకా ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera) అనే మూవీ తెలుగులో రానుంది. ఈ మూవీలో నాగార్జున హీరోగా చేస్తుండగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ మూవీ జూన్‌లో రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది.