వాడు ఇంకెదో ప్లాన్‌ చేశాడు

Viswa
1 Min Read

Web Stories

Aaryan Trailer: తమిళ హీరో విష్ణువిశాల్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ సస్పెన్స్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఆర్యన్‌’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలో విష్ణు విశాల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించాడు. శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి, సెల్వరాఘవన్‌ ఇందులోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. లేటేస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ప్రవీణ్‌ కె డైరెక్షన్‌లో ఆర్యన్‌ రమేష్, శుభ్ర, విష్ణు విశాల్‌లు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 31న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. విడుదలైన, ఈ సినిమా తెలుగు ట్రైలర్‌లో ఈ కింది డైలాగ్స్‌ ఉన్నాయి. ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతం అందించాడు.

ప్రారంభం అంటే…ఏం ప్రారంభం కాబోతుంది

హత్యచేయడానికి కరెక్ట్‌గా గంట ముందు చావబోయే క్యారెక్టర్‌ ఎవరో రివీల్‌ చేస్తాడు

దేశం మొత్తం చూస్తున్నారు..వాడు ఒక్క ప్రాణం కూడ తీయడానికి వీల్లేదు

అతన్ని ఎలా ఆపగలం

వీళ్లనే ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. పబ్లిసిటీ స్టంటా?

వాడు ఇంకెదో ప్లాన్‌ చేశాడు

ఈ హత్యలు చేయాలని ఒకడు జీవితం మొత్తం ప్లాన్‌ చేసి, పర్‌ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్‌ చేశాడు

ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడా వెతికినా సరే..నేను నీకు దొరకను…

ఇది పర్‌ఫెక్ట్‌ క్రైమ్‌ కాదు…అతనొక పర్‌ఫెక్ట్‌ క్రిమినల్‌

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu