హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘పీరియాడికల్’ యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ (Devara). తండ్రీకొడుకులుగా (తండ్రి దేవర, కొడుకు వర) ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఫిల్మ్ ఇది.
2024 సెప్టెంబరులో థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీకి, మిక్డ్స్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఈ యావరేజ్ సినిమాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టుదలతో హిట్ స్టేటస్‌కు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ‘దేవర’ సినిమాకు రూ. 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా అప్పట్లో మేకర్స్ ప్రకటించారు.
‘దేవర’ సినిమా అతికష్టం మీద గట్టెక్కడంతో, ‘దేవర 2’ (Devara part2) ఇక ఉండకపోవచ్చనే అనుకున్నారు ఎన్టీఆర్ ఫ్యా న్స్, ఇండస్ట్రీ వర్గాలు. అయితే ‘దేవర’ సినిమాను ఈ ఏడాది మార్చి 28న జపాన్‌లో రిలీజ్ చేశారు. ఈ మూవీకి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. అక్కడి మీడియాతో ఎన్టీఆర్ మాట్లాడాడు. ‘దేవర 2’ ఉంటుందని, రెండోపార్టులో దేవర ఎలా, ఎందుకు చనిపోయాడు? అసలు చనిపోయాడా లేదా? అనే ఆసక్తికర కథనాలు
సినిమాలో ఉంటాయన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ ఆడియన్స్ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ‘దేవర 2’ ఉండదనే ఫిక్సయ్యారు.
కానీ…ఏప్రిల్ 4, 2025న హైదరాబాద్‌లో జరిగిన ‘మ్యాడ్ 2’ సినిమా ఈవెంట్‌లో ‘దేవర 2’ ఉంటుందని, ‘దేవర 2’ లేదని అనుకుంటున్న వాళ్లందరిని కోసం ఈ విషయాన్ని చెబుతున్నానని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు.
అలాగే ‘అదుర్స్ 2’ఆలోచన ఉందని, కాకపోతే…ఆ స్థాయిలో కామెడీ ఇప్పుడు చేయగలనా?లేదా? అనే భయం తోనే ‘అదుర్స్ 2’ చేయడం లేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ ప్రజెంట్ ‘వార్ 2’తో బిజీగా ఉన్నాడు. అతి త్వరలోనే ‘డ్రాగన్’ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవు తారు. ఆ తర్వాత ‘దేవర 2’, నెల్సన్‌తో ఓ మూవీ చేసే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్.