‘అఖండ 2’ ఎఫెక్ట్.. NBK111 కి ఊహించని కష్టాలు?

Kumar NA
1 Min Read
హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.

Web Stories

NBK111: బాలయ్య బోయపాటి కాంబోలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఆ ప్రభావం ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం NBK 111 పై పడినట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందాల్సిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, ఒక పీరియాడికల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేశారు.

ఈ సినిమా కోసం దాదాపు రూ. 100 నుండి 200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఒక పాత్రలో రాజుగా.. మరో పాత్రలో యోధుడిగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. అయితే ‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో, అంత పెద్ద మొత్తాన్ని రికవరీ చేయడం కష్టమని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని అంత బడ్జెట్ పెట్టి నిర్మించడం సాధ్యం కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే భారీ ఖర్చుతో కూడిన హిస్టారికల్ ఎపిసోడ్లను తొలగించి, కథను ఒక సాధారణ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మార్చాలని దర్శకుడికి సూచించినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌లో మార్పులు జరిగితేనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది, లేని పక్షంలో ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం నయనతారను ఎంపిక చేసినప్పటికీ, షూటింగ్ ప్రారంభంపై స్పష్టత లేదు. కాగా గతంలో బాలయ్య-గోపీచంద్ కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ నమ్మకంతోనే బాలయ్య మరో అవకాశం ఇచ్చారు. కానీ ప్రస్తుత సమీకరణాలు మారుతుండటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi