సినిమా: ఇడ్లీ కొట్టు (Dhanush Idli Kottu Review)
ప్రధాన తారాగణం: ధనుష్, నిత్యామీనన్, షాలినీ పాండే, రాజ్‌కిరణ్, అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్రఖని
దర్శకత్వం: ధనుష్
నిర్మాణం: ఆనంద్ భాస్కరన్,ధనుష్
కెమెరా: కిరణ్ కౌశిక్
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
ఎడిటింగ్: జీకే ప్రసన్న
నిడివి: 2 గంటల 27 నిమిషాలు
విడుదల తేదీ: అక్టోబరు 1, 2025
సెన్సార్: ‘యూబైఏ’ సర్టిఫికేట్
రేటింగ్:2.5/5
కథ
Dhanush Idli Kottu Review: శంకరాపురంలో శివకేశవులుది (రాజ్‌కిరణ్) ఇడ్లీ కొట్టు వ్యాపారం. ఇడ్లీలు వేయడమే శివకేశవుల జీవనోపాధి. శివకేశవుల ఇడ్లీకొట్టుకి మంచి గిరాకీ, పాపులారిటీ ఉంటుంది. శివ కేశవుల కొడుకు మురళి (ధనుష్) హోటల్ మెనేజ్‌మెంట్ చదువుతాడు. కానీ తండ్రిలా ఇడ్లీలు వేసుకుంటూ, గ్రామానికే పరిమితం కాకుండ, పట్టణానికి వెళ్లి బాగా సంపాదించాలనుకుంటాడు. అలా బ్యాంకాక్‌లోని ఏఎఫ్‌సీ రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. ఈ ఏఎఫ్‌సీ చైన్ రెసారెంట్స్ ఓనర్ విష్ణువర్థన్ (సత్యరాజ్) కుమార్తె మీరా (షానిలీ పాండే)…మురళిని ప్రేమించి, పెళ్లిచేసు కోవాలనుకుంటుంది. మురళీ కూడా మీరాతో పెళ్లికి అంగీకరిస్తాడు. కానీ మీరా అన్నయ్య అశ్విన్‌కి (అరుణ్ విజయ్) మాత్రం మురళీ–మీరాల వివాహం నచ్చదు. కానీ చెల్లి ఇష్టాన్ని కాదనలేక, సరే అన్నాడు (Dhanush Idli Kottu Review)
మురళి–మీరాల పెళ్లి సమయం దగ్గర పడుతుంది. కానీ తన పట్ల అశ్విన్ వ్యవహరించే తీరు మురళీకి ఏ మాత్రం నచ్చదు. ఈ విషయంలో మురళీ ఆలోచనలో పడతాడు. పెళ్లికి ముందు జరిగే కాక్‌టైల్ పార్టీలో తన తండ్రి మరణించాడని మురళీకి ఫోన్ కాల్ వస్తుంది. అంతే.. బ్యాంకాక్ నుంచి శంకరాపురం వెళ్తాడు. తండ్రి చినిపోయిన ఒకట్రెండు రోజుల్లోనే మురళి తల్లి కూడా కాలం చేస్తుంది. దీంతో మురళి మరింత కుంగిపోతాడు. ఈ క్రమంలో తనలో తాను తనని అన్వేషించుకోవడం మొదలుపెడతాడు. తండ్రి ఇండ్లీకొట్టును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. మరి..ఈ తర్వాత ఏం జరిగింది? మీరా–మురళిల పెళ్లి జరిగిందా? లేదా? మురళి చిన్నపాటి స్నేహితురాలు కల్యాణీ కథ ఏమిటి? ఊరి వాళ్లు మురళీకి ఎలా సహాయం చేశారు? అన్నది సినిమాలో చూడాలి. (Idli Kottu Review).
కథనం
విదేశాలకు వెళ్లిన మన మూలాలు మర్చిపోకూడదని, సంతోషం మనం చేసే పనిలోనే ఉం టుంది కానీ.. డబ్బు, హోదా, పరపతి..ఇవేవీ ప్రశాంతను ఇవ్వలేవని నమ్మే ఓ వ్యక్తి కొడుకు కథే ఈ సినిమా. కొడుకులు ఎక్కడో విదేశాల్లో ఉంటూ, తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత.. అరె.. వాళ్లను సరిగా చూసుకోలేదనే పశ్చాత్తాపం పడే బదులు..వాళ్ళు జీవించి ఉండగానే, వారితో కలిసి సంతోషంగా ఉండాలని తెలుసుకున్న ఓ కొడుకు కథ. ఈ తరహాలో ‘శతమానం భవతి’ వంటి సినిమాలు తెలుగులో వచ్చి ఉండొచ్చు..కానీ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా స్టోరీ ట్రీట్ మెంట్ వేరు. (Idlukottu Movie Story)
శివకేశవుల ఇడ్లీ కొట్టు, మురళి బ్యాంకాక్ రావడం, అశ్విన్, మీరా, విష్ణువర్థన్‌ల పాత్రల పరి చయం, మురళి–అశ్విన్‌ల పెళ్లి సన్నివేశాలతో తొలిభాగం డీసెంట్‌గా సాగుతుంది. మురళి పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడంతో, అశ్విన్ శంకారాపురం వచ్చి, అక్కడ జరిగే ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంట్రవెల్ వస్తుంది. మురళీ ఊరికి దగ్గర అవ్వాలన్న సీన్స్, అశ్విన్ తన తప్పు తాను తెలుసు కోవడం, నాన్న శివకేశవులు నేర్పిన అహింస ధర్మాన్ని మురళీ పాటిండం వంటి సీన్స్‌తో సినిమా ముగుస్తుంది.

శివకేశవులు–మురళీ మధ్యల ఉన్న సీన్స్, నాన్న గురించిన సీన్స్ మంచి ఎమోషనల్‌గా ఉన్నా యి. తొలి భాగం ఎమోషన్స్‌తో బాగానే ఉంటుంది. కానీ అశ్విన్ కోసం ఓఫైట్ ఇరికించడం నప్పలేదు. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఒకే. కానీ అక్కడ్నుంచి కథను ముందుకు తీసుకుని వెళ్లడంలో ధనుష్ కాస్త తడబడ్డాడు. ఊరికి మురళీ దగ్గరవ్వాలని అనుకోవడం, మురళీ కోసం ఊరి జనం తాపత్రయపడటం వంటి సీన్స్ కన్విన్సింగ్‌గా లేవు. వీటికి తోడు ఊహాత్మాక సన్ని వేశాలు మరో మైనస్. ఇలాంటి జానర్స్‌లో క్లైమాక్స్ ఏంటో ఆడియన్స్ ముందే ఊహించ గలరు. అలాంటప్పుడు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం ఏదీ ఇందులో కనిపించదు. ఒకవైపు అహింస అంటూనే మరోవైపు, హీరో ఫైట్స్ చేస్తుంటాడు. ఫైట్ అయి పోగానే మళ్లీ అహింస అంటాడు. ఇది ఆడియన్స్ థియేటర్స్‌లో ఒకింత హింసే. మురళీ సొంతూరిలో ఉండాలనుకోవడం ఒకే. కానీ మీరాతో మురళీ పెళ్లి వద్దనుకోవడానికి గల కారణాన్ని బలంగా స్క్రీన్‌పై చెప్పలేకపోయాడు ధనుష్.
నటీనటులు-సాంకేతిక విలువలు
మురళి పాత్రలో ధనుష్ చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో ధనుష్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్యాణీగా కథలో నిత్యామీనన్‌కు మంచి పాత్ర లభించింది. మురళికి తోడుగా, అండగా ఉండే కల్యాణీగా నిత్యానటన భేష్. మీరాగా షాలినీ పాండే పెర్ఫార్మెన్స్ ఒకే. కానీ ప్రీ క్లైమాక్స్‌లో మీరా ఓ మంచి సీన్ లభించింది. ఇక ధనుష్ తర్వాత ఈ సినిమాను భుజాలపై మోసింది రాజ్‌కిరణ్. ఈ సినిమాకు రాజ్‌కిరణ్ పెద్ద ఎస్సెట్. ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టారు. ఒక పోలీస్ ఆఫీసర్‌గా పార్తీబన్, పట్టాభిగా సముద్రఖని,ధనుష్‌గా సపోర్ట్‌గా ఉండే పాత్రలో ఇళవరసు, ధనుష్ తల్లిగా గీతా కైలాసం వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
ధనుష్,ఆనంద భాస్కరన్‌ల నిర్మాణ విలువలు బాగున్నాయి. «కెమెరా వర్క్ బాగుంది. పల్లెటూరి విజువల్స్‌ను బాగా తీశారు. జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ బాగుంది. ఆర్‌ఆర్ ఒకే. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. ముఖ్యంగా «సెకండాఫ్ స్టార్టింగ్‌లో.