Idli Kottu Story: ధనుష్‌ది డిఫరెంట్ స్టైల్. ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే, మరోవైపు వీలైనప్పుడల్లా డైరెక్షన్ చేస్తుం టాడు. తాను డైరెక్ట్ చేసే చిత్రాల్లో ఎక్కువగా తానే హీరోగా నటిస్తుంటాడు. అలా ధనుష్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు నిత్యామీనన్, సత్యరాజ్, రాజ్ కిరణ్, శాలినీ పాండే ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ధనుష్, ఆకాష్‌భాస్కరన్ నిర్మాతలు. ఈ సినిమాను అక్టోబరు1 (Idli Kottu Movie Release date)న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్స్ (idly kottu Telugu Trailer)ను రిలీజ్ చేశారు.
అశ్విన్ ..మురళీ మన కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ప్రాఫిట్ 50 పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది.
సూపర్…మురళీ పనోడంటే నీలానే ఉండాలి….
నీ కోసం ఓ పెద్ద సమ్రాజాన్నే స్థాపించాను..కానీ నువ్విలా..బాధ్యత లేకుండ ప్రవర్తించడం నాకు నచ్చట్లేదు
స్పీడ్ చూశారుగా..! నాన్న..ఎలాగైనా కొన్నేద్దాం..నాన్న..! గంటలు గంటలు కూర్చొని రుబ్బాల్సి న అవసరం లేదుగా..!
‘మిషన్లతో అన్నీ చేసేయెచ్చంటారు..కానీ రుచి అనేది మాత్రం మనసు పెడితేనే వస్తుంది..
జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు..ఆస్వాదిస్తూ కూడా చేయాలి. వ్యాపారంలో దొరకని తప్తి..వ్యాపకంలో దొరుకుతుంది.
కానీ మన బిడ్డ వారసత్వాన్ని వదలి వలస వెళ్లిపోయాడు..కదమ్మా..!
అయినా వాడు ఎక్కడికీ వెళ్తాడు..ఎగిరెగిరి ఇక్కడికే రావాలి!
దాన్ని ఉట్టి కొట్టునుకోమాక…ఈ ఊరి గుండెకాయ
ఆ ఇడ్లీ కొట్టంటే..మా ఊరివాళ్లకు సెంటిమెంట్ సార్…
వాడ్ని నాశనం చేసేదాకా..నేను ఇక్కడ్నుంచి కదలను
దమ్మిడికి పనికిరాని వాడి నాన్న ఇడ్లీ కొట్టుకోసం వాడు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.
ఏవండీ…మీకు ఇడ్లీలు వేయడం అంటే అంత ఇష్టమా….?
ఇష్టమా…ఇడ్లీలు వేయడానికే నేను పుట్టాననిపిస్తోంది…!
ట్రైలర్‌ను బట్టి….తన నాన్న (రాజ్‌కిరణ్) ఇడ్లీ కొట్టులో పనిచేయడానికి ఇష్టపడని మురళి (ధ నుష్), సీటీలో ఏఎఫ్‌సీ అనే ఓ పెద్ద రెస్టారెంట్ లో పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ (సత్యరాజ్) కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్) బాధ్యత లేకుండా తిరుగు తుంటాడు. అశ్విన్ బాక్సర్‌గా ట్రైన్ అవుతుంటాడు. ఈ క్రమంలో ఓ సందర్భంగా మురళీని అశ్విన్ అవమానిస్తాడెమో. దీంతో మురళీ మళ్లీ తన సొంత ఊరికి తిరిగి వచ్చి, తన నాన్న ఇడ్లీ కొట్టు పనిని కొనసాగిస్తుంటాడు. కానీ ఈ ఇడ్లీ కొట్టును వెతుక్కుంటూ అశ్విన్…మురళీ ఊరికి వస్తాడు. ఎందుకు? అనేది తెలియాల్సి ఉంది. అలాగే షాలిని పాండే పాత్రను కాస్త మిస్టరీగా ఉంచారు. బహుశా….ధనుష్ సిస్టర్‌గా, అశ్విన్ ప్రేయసిగా ఫాలినిపాండే కనిపించే అవకాశాలు లేకపోలేదు. ధనుష్ ఇష్టపడే అమ్మాయి కళ్యాణీ పాత్రలో నిత్యామీనన్ కనిపిస్తారు. ((Idli Kottu/Idly Kadai Cast and Crew)
ట్రైలర్ రోటీన్‌గానే ఉంది. కానీ విజువల్స్, ట్రీట్‌మెంట్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమో షన్స్, ఊరి జనం వంటి అంశాలు కూడా ఉన్నాయి. సినిమా విడుదలై, ఓ సారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే, ఈ సినిమాకు ఆడియన్స్ క్యూ కడతారు. ఎందుకంటే..రీసెంట్ టైమ్స్‌లో దర్శ కుడిగా ధనుష్ ఆడియన్స్‌ను నిరాశపరిచింది లేదు.