ధనుష్ (Hero Dhanush) హీరోగా చేతిలో బోలేడు సినిమాలు ఉంటాయి. వీటికి తోడు వీలైనప్పుడల్లా ధనుష్ తన డైరెక్షన్‌లోనే మూవీ చేస్తాడు. ప్రజెంట్ ధనుష్ అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో కొన్ని ప్రీ ప్రొడక్షన్‌లో ఉంటే, మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. తాజాగా మరో సినిమాకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే ‘కలామ్: ది మిస్సైల్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’.
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ఖగోళ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలామ్ జీవితం (A. P. J. Abdul Kalam Biopic) బయోపిక్ ‘కలామ్: ది మిస్సైల్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ (. ఈ సినిమాలో ధనుష్ టైటిల్ రోల్ చేయనున్నాడు. ‘టీ–సిరీస్’ ఫిల్మ్స్, గుల్షన్‌కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్‌కుమార్, కృష్ణణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మిస్తారు. ‘తన్హాజీ, ఆదిపురుష్’ సినిమాలను తీసిన ఓం రౌత్ (Director Om Raut) ఈ బయోపిక్‌కు దర్శకుడు.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న 78వ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ (78thCannes film festival) సెలబ్రేషన్స్‌లో ‘కలామ్: ది మిస్సైల్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ (Kalam: The Missile man of india Movie) టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ కోసం ధనుష్ ఫిజికల్ ట్రాన్ఫార్మ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ సినిమాకు రూపకల్పన జరిగిందని, అది ఇప్పుడు సాధ్యమైందని నిర్మాత అనిల్ సుంకర చెబుతున్నారు.

మరోవైపు… ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా బయోపిక్‌లో యాక్ట్ చేయనున్నాడు ధనుష్. ఈ సినిమాకు ఇళయారాజయే స్వరకర్త. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. అయితే ఈ మూవీ ఆగిపోయినట్లుగా వార్తలు ఉన్నాయి. తన సినిమాలతో ధనుష్, దర్శకుడు లోకేష్ కనగరాజŒ ను పరిచయం చేసే పనిలో అరుణ్ మాథేశ్వరన్..ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలా ‘ఇళయ రాజా’ బయోపిక్ ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మరోమారు అధికారిక ప్రకటన రాకముందే, ఏపీజే అబ్దుల్ కలామ్ మూవీ బయోపిక్ తెరపైకి రావడం విశేషం. మరి..ధనుష్ ఈ రెండు బయోపిక్‌లను కంప్లీట్ చేస్తారా? లేక…ఏపీజే అబ్దుల్ కలామ్ బయోపిక్‌తోనే సరిపెడతారా? అనేది చూడాలి.
ఇక ధనుష్ హీరోగా చేస్తున్న ‘కుబేర’ మూవీ జూన్ 20న, ఆయన డైరెక్షన్‌లోని ‘ఇడ్లీకడై’ సినిమా సెప్టెంబరులో రిలీజ్ కానున్నాయి.