Harish Shankar: టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్ఫుల్ సినిమాలు తీయడంలో, దర్శకుడు హరీష్‌శంకర్‌కు మంచి పేరుంది. ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్, గద్దలకొండగణేష్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్..’ వంటి సినిమాల సక్సెస్‌లే ఇందుకు నిదర్శనం.
హరీష్‌శంకర్ (Director Harish Shankar) డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’. ఇందులో పవన్‌కల్యాణ్ హీరోగా నటించగా, రాశీఖన్నా–శ్రీలీలలు హీరోయిన్స్‌గా చేశారు. ఈ ఏడాది మార్చి 19న ఈ సినిమా రిలీజైంది. కానీ ఆడియన్స్ నుంచి సరైన స్పందన రాలేదు.
ఇక ‘తీరువీర్’ నటించిన ‘పాపంప్రతాప్’ సినిమా ఈ నెల 17న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రెస్‌మీట్‌కు హరీష్‌శంకర్ ఓ గెస్ట్‌గా వచ్చారు. రాగానే, ‘పాపం హరీష్’ అన్నారు (పాపం ప్రతాప్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా…సరదాగా..). ఈ విషయంపై హరీష్‌శంకర్ స్పందించారు. తన రీసెంట్ మూవీ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ సరిగా ఆడలేని కారణం, యాంకర్ …తనను పాపం హరీష్ అని అని ఉంటారని తాను అనుకున్నానని చెప్పారు. ఇలా..ఉస్తాద్‌భగత్‌సింగ్ సినిమా ఆడలేదన్న విషయాన్ని ఒప్పుకున్నారు. ఏదీఏదైతేనేం…హరీష్‌శంకర్ రియాలిటీ మాట్లాడటంతో, అందరు ఆయన్ను అభినందిస్తున్నారు. ఈ రియాలిటీని ఇలానే కొనసాగించాలని ఆయన సినిమాలను ఫాలో అయ్యే ప్రేక్షకులు హరీష్‌కు హితవు పలుకుతున్నారు.
అలాగే ఈవెంట్లోనే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు హరీష్‌శంకర్. జీవితంలో మనకు నచ్చిన పని చేయడమే పెద్ద సక్సెస్ అని హరీష్ చెప్పారు. అలాగే తాను ఇప్పటివరకు తీసినవి తొమ్మిది సినిమాలు అయితే, 19 సినిమాలు ఆగిపోయాయని తెలిపారు. అంతేకాదు..ఎల్లుండి కొత్త సినిమా స్టార్ట్ అనుకున్న, సినిమా కూడ ఆగిపోయిందని హరీష్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఎప్పుడు అగ్రెసిస్ అటిట్యూడ్‌తో మాట్లాడే, హరీష్‌శంకర్ ఇలా రియాలిటీలోకి వచ్చి, ఇలా మాట్లాడటం మంచి విషయమే.