తమన్నా నాగసాధువు శివశక్తి పాత్రలో చేసిన మూవీ ‘ఓదెల 2’. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే…ఇలా దర్శకుడు సంపత్‌నంది సూపర్ విజన్‌తో అశోక్‌తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించారు. హెబ్బాపటేల్, వశిష్ట ఎన్. సింహా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్స్‌లోకి వస్తుంది. ఈ సందర్భంగా ఓదెల 2 సినిమా విషయాలను దర్శకుడు సంపత్‌నంది (Director sampathNandi Interview Interview) పంచుకున్నారు….
ఓదెల 2 ఎలా మొదలైంది!
నాకు అశోక్‌తేజ మంచి స్నేహితుడు. మా అనుబంధం దశాబ్ధానికి పైనే. అశోక్‌తేజను దర్శకుడిగా పరిచయం చేద్దామని, ‘ఓదెల రైల్వేస్టేషన్ (Odela RailwayStation)’ సినిమా తీశాం. నా కథ, స్క్రీన్ ప్లేతో. గంటన్నర నిడివి గల ఈ మూవీ ఓటీటీలో విడదలై, పెద్ద విజయం సాధించింది. ఆహా వాళ్లు తమిళ ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అలా ఓ సందర్భంగా అశోక్‌తేజ ఈ సినిమాకు సీక్వెల్ గురించి ఆలోచించమన్నాడు. సరే అనుకున్నాం. ఆ తర్వాత ఓ సినిమాకు సంబంధించి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోతో, మ్యూజిక్ సి ట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆ సమయంలోనే నాకు ఈ ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ (Odela2)ఆలోచన వచ్చింది.
అందుకే నిర్మాత మారారు
నిర్మాత కేకే రాధామోహన్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన బ్యానర్‌లో ఎక్కువ హిట్ సినిమాలు తీసింది కూడా నేనే. ‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ (Odela 2 Story) కథ రాసిన తర్వాత, ఆయనకే కథ వినిపించాను. కానీ రాధామోహన్‌గారు ఆ సమయంలో ఓ హిందీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. మీ స్నేహితుడు ఎవరైనా ఉంటే నిర్మాతగా ముందుకు వెళ్లమని చెప్పారు. రా«ధామోహన్ గారి అనుమతులు తీసుకునే ‘ఓదెల 2’ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత డి. మధుగారు ‘ఓదెల 2’ సినిమాను నిర్మించారు. దాదాపు ఎనభై రోజుల పాటు షూటింగ్ చేశాం.
నేను ఓదెల 2 వంటి కథ రాస్తానని అనుకోలేదు!

రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్‌నంద…ఇలాంటి మాస్ కమర్షియల్ సినిమాలు తీసే నేను…‘ఓదెల 2’ వంటి ఆథ్యాత్మిక అంశాలతో కూడిన కథను రాస్తానని అనుకోలేదు. మా ఆవిడ మా ఇంట్లో శివుని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని, నిత్యం పూజలు చేస్తూ ఉంటుంది. శివాలయాల రక్షణ చూసుకూనే శివశక్తిగా మా నాన్నమ్మ చేశారు. మా స్వస్థలం వేములవాడలోని ఓదెల గ్రామమే. అక్కడ నేను కొన్ని సంఘటలను చూశాను కూడా. ఇవన్నీ నా మైండ్‌లో ఉండిపోయాయి. ఇలా…‘ఓదెల 2’ కథ రాశాను. చెప్పాలంటే..‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీ అప్పుడున నాకు సీక్వెల్ ఆలోచనే లేదు. ఆ తర్వాత రాశాను (Odela2 – Supervision Director sampathNandi Interview )
తమన్నానే ఎందుకు?

చెప్పాలంటే…సినిమాలో చేసిన నాగసాధువు శివశక్తి పాత్రను మెయిన్ యాక్టర్ అయినా చేయవచ్చు. కానీ… ‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీలో రాధా పాత్ర (హెబ్బాపటేల్) పాత్ర హైలైట్ అయ్యింది. అలా రెండో పార్టులో కూడా ఓ పెద్ద ఫీమెల్ స్టార్ ఉంటే బాగుంటుందని తమన్నా (Tamannaah) గారిని తీసుకోవడం జరిగింది. తమన్నాగారితో నేను ఆల్రెడీ ‘రచ్చ, సీటీమార్’ సినిమాలు తీశాను. ‘సీటీమార్’ సినిమా సమయంలో…రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న ఓ సీన్‌లో తమన్నాలోగారిలో ఓ చిన్నపాటి స్పార్క్ గమనించాను. అలా…‘ఓదెల 2’కు ఆమె సరిపోతా రనిపించింది. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. పైగా…నువ్వు కావాలయ్యా, ఆజ్‌కారాత్…వంటి స్పెషల్ సాంగ్‌తో తమన్నాగారు రీసెంట్‌గా చాలా పాపులర్ అయ్యారు. నటిగా ఆమెకు ఇది మంచి చేంజ్ ఓవర్‌లా కూడా ఉంటుంది. అయినా..నయనతార, సమంత…వంటి సీనియర్ యాక్టర్స్‌కు శివశక్తిలాంటి పాత్రలు తమన్నా(Tamannaah Odela2) తరహా పాత్రలు పోషించడం అనేది చాలా సులువుగానే ఉంటుంది.
మీరే ఎందుకు దర్శకత్వం వహించలేదు!
‘ఓదెల 2’ను ఇంత పెద్ద స్పాన్‌లో తీస్తామని ముందే అనుకోలేదు. ఆ సమయంలో నేను గాంజాశంకర్ ( సాయిదుర్గాతేజ్ హీరో) మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాను. కానీ ఆ సినిమా ఆగిపోయింది. అదే సమయంలో తమన్నాగారు ఓదెల 2 ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. డి.మధుగారు కూడా ఆ ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్ కావాలని, పెద్ద స్పాన్‌లో తీస్తున్నామని అడిగారు. దీంతో సరే అన్నాను. అశోక్‌తేజ నా స్నేహితుడే. ఇప్పుడు ఓ పెద్ద సినిమాకు దర్శకుడిగా ఆయన పేరు పడుతోంది. ఇది అశోక్‌కు అదృష్టమే కదా.’ఓదెల 3′ కూడా ఉంటుంది. సీక్వెల్‌ను గురించి ‘ఓదెల 2’లో చెప్పాం. ఇలాంటి సినిమాలను ప్లాన్ చేసి, తీయలేం. ఆ కాలభైరవుడే ‘ఓదెల 2’ సినిమాను నా చేయి రాయించడాని అనుకుంటున్నాను.
మరి.. కథ ఏంటి?
ఆత్మకు, పరమాత్మకు మధ్య యుద్ధం. ఇదే ‘ఓదెల 2’ స్టోరీ. ఇందులో నాగసాధువు శివశక్తి (తమన్నా రోల్), తిరుపతి (వశిష్ట ఎన్. సింహా) ప్రేతాత్మను అంతం చేయడానికి పెద్ద పెద్ద ఆయుధాలు ఏమీ ఉండవు. ఓ పంచాక్షరి మంత్రంతో ఎలా అంతం చేసింది? అన్నదే స్టోరీ. ఈ సినిమాలో హె బ్బాపటేల్ పోషించిన రాధా పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ శివుని కృషతో, అంతా సవ్యంగా జరిగిపోయింది. మేం ఊహించని విషయాలు కూడా ఆకస్మాత్తుగా జరిగిపోయాయి. క్లైమాక్స్ కోసం ఓ పెద్ద సెట్ వేశాం. 800 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. మా సమీప ప్రాంతాల్లో వర్షం పడింది. కానీ మా ప్లేస్‌లో పడలేదు. ఇక ఓదెల 2 స్టోరీని కూడా ఓ కాలభైరవుడే నా చేత రాయించి ఉంటాడని నేను అనుకుంటు న్నాను. నేను కమర్షియల్ సినిమాలు తీశాను కాబట్టి..వీఎఫ్‌ఎక్స్ విషయంలో నాకు అంత బుర్ర లేదు (నాలెడ్జ్ అవగాహన) లేదు. ‘ఓదెల 2’ నుంచి కొంతే నేర్చుకున్నాను. సో…భవిష్యత్‌లో నా నుంచి సైన్స్ ఫిక్షన్ జానర్‌లో పెద్ద సినిమాలేవీ రావు.
అరుంధతితో పోలిక లేదు..కానీ!
అనుష్కాశెట్టిగారి ‘అరుంధతి’ సినిమాతో మా ‘ఓదెల 2′ సినిమాకు పోలీక లేదు. అయితే ఈ సినిమాలోని తిరుపతి ఆత్మను మళ్లీ కథలోకి తీసుకురావడానికి మాత్రం..శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి…’అరుంధతి’ సినిమాను కాస్త ఫాలో కావాల్సి వచ్చింది. ఈ ఒక్కటీ తప్పలేదు..ఎందుకంటే..వేరే దారి లేదు.
మీ డైరెక్షన్‌లోని మూవీ!
త్వర త్వరగా సినిమాలు చేయాలని నాకేం లేదు. దర్శకుడిగా ప్రస్తుతం శర్వానంద్‌తో ఓ విలేజ్ బ్యాగ్ డ్రాప్‌లో ఓ పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాను. వందరోజులకు పైగా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. భారీ క్యాన్వాస్‌తో ఉంటుందీ మూవీ.