దర్శకుడు త్రివిక్రమ్ (Director TrivikramSrinivas movies), ఎన్టీఆర్‌లు కలిసి తొలిసారిగా ‘అరవిందసమేత వీరరాఘవ’ సినిమా చేశా రు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబి నేషన్‌లో మరో మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత ఈ సినిమా నిలిచిపోయింది. కారణాలు ఏమైనా…దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేశారు. ఇటు…మహేశ్‌బాబుతో ‘గుంటూరుకారం’ సినిమా చేసి, ఆడియన్స్‌ను, మహేశ్ ఫ్యాన్స్ ను నిరాశపరిచారు త్రివిక్రమ్.
ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్‌తో ఓ మూవీ చేయాలని అనుకున్నారు త్రివిక్రమ్. ఆల్రెడీ …‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో…’ వంటి సినిమాల సక్సెస్‌లను అల్లు అర్జున్‌కు అందించారు త్రివిక్రమ్. ‘పుష్ప: ది రూల్’ తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ల మూవీ సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ లాస్ట్ మినిట్‌లో త్రివిక్రమ్‌కు షాక్ తగిలింది,‘పుష్ప: ది రూల్’ సినిమా సక్సెస్ తర్వాత త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి, తమిళ దర్శకుడు అట్లీతో ముందుకెళ్లాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్…అల్లు అర్జున్ కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేస్తే, అల్లు అర్జున్ మాత్రం రెండు నెలల్లోనే అట్లీకి షిష్ట్ అయి పోయాడు.
అప్పుడు ఎన్టీఆర్‌కి హ్యాండ్ ఇచ్చిన త్రివిక్రమ్‌కు…ఇప్పుడు అల్లు అర్జున్ షాక్ ఇచ్చాడు. బహు శా..కర్మ అంటే ఇదెనమో…మరోవైపు వెంకటేష్, రామ్‌చరణ్, రామ్‌లతో వరుస సిని మాలు చేసేందుకు త్రివిక్రమ్ సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ముందుగా వెంకటేష్‌తో సినిమా సెట్స్‌కు వెళ్లొచ్చు.