Prabhas Salaar 2 update: హీరో ప్రభాస్ నుంచి తాజాగా ‘ది రాజాసాబ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం సందీప్‌రెడ్డివంగా డైరెక్షన్‌లోని ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మార్చి 5, 2027లో విడుదల కానుంది.
అలాగే వచ్చే నెల ఫిబ్రవరిలో ప్రభాస్ సినిమా ‘కల్కి2898ఏడీ పార్టు 2’ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇక ఎలాగూ హను రాఘవపూడి డైరెక్షన్‌లోని ‘ఫౌజి’ సినిమా చిత్రీక రణతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2026లో థియేటర్స్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఇలా ఉండగానే …అతి త్వరలోనే ‘సలార్ 2’ అప్‌డేట్ రానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది (#Prabhas Salaar 2 update).
‘సలార్’ దర్శకుడు ప్రశాంత్‌నీల్ ప్రజెంట్ ఎన్టీఆర్‌తో ‘ఎన్టీఆర్‌నీల్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది. ఒకవైపు సినిమా చేస్తూనే, మరోవైపు ‘సలార్ 2’ సినిమా స్క్రిప్ట్ పనులను కూడా ప్రశాంత్‌నీల్ పర్యవేక్షిస్తున్నారట. అతని అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ ‘సలార్ 2’ పనులను స్పీడప్ చేస్తున్నారట ( #Salaar 2 update). మరి..సలార్ 2 కూడా ఈ ఏడాదే సెట్స్‌కు వెళ్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ (Telugu Cinema).
ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్’ చిత్రంలోని తొలిపార్టు ‘సలార్: ది సీజ్‌ఫైర్’ చిత్రం 2023 డిసెంబరులో విడుదలై, దాదాపు రూ.600 కోట్ల రూపాయాలకు పైగా కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. సలార్ రెండోపార్టుగా ‘సలార్:శౌర్యంగాపర్వం’ రానుంది (#Prabhas Salaar sequel update).