Gamechanger Story:గేమ్‌చేంజర్‌ ట్రైలర్‌ రిలీజ్‌…స్టోరీ ఇదేనా?

Viswa
1 Min Read

Web Stories

Gamechanger:రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా నటించిన ‘గేమ్‌చేంజర్‌ (Gamechanger)’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. రాజమౌళి గెస్ట్‌గా హాజరై, ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. గేమ్‌చేంజర్‌ ట్రైలర్‌ ఆసక్తికరంగానే ఉంది. ఇందులో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్‌ రామ్‌నందన్‌ పాత్రలో, రామ్‌నందన్‌ తండ్రి అప్పన్న పాత్రలో రామ్‌చరణ్‌ నటించారు. జీ స్టూడియోస్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ సినిమాకు తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌ చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్‌ జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. తమన్‌ ఈ మూవీకి స్వరకర్త.

స్టోరీ ఇదేనా?

రామ్‌నందన్‌ ఓ స్టూడెంట్‌. బాగా కోపం ఎక్కువ. ముందుగా పోలీసాఫీసర్‌ అవుతాడు. తనకున్న కోపం కారణంగా ఆ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో కష్టపడి ఐపీఎస్‌ ఆఫీసర్‌ అవుతాడు. కలెక్టర్‌గా చార్జ్‌ తీసుకుని, రాజకీయ నాయకుల అక్రమాలకు అడ్డుగా నిలుస్తుంటాడు. ఓ సందర్భంగా ముఖ్యమంత్రితో రామ్‌నందన్‌ పోటీ పడాల్సి వస్తుంది. ఆ సమయంలో తన తండ్రి అప్పన్న కూడా రాజకీయ నాయ కుడని, తన తండ్రి మోసపోవడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందని గ్రహించి, రామ్‌నందన్‌ వారికి ఏ విధంగా బుద్దిచెబుతాడు? ఏ విధంగా రివేంజ్‌ తీర్చుకుంటాడు? అన్నదే ఈ సినిమా కథ. నిజానికి గేమ్‌చేంజర్‌ కథను, తమిళ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజు రెడీ చేశారు. ఈ కథను శంకర్‌ డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాలోని పాటలకు చిత్రంయూనిట్‌ 75 కోట్ల రూపాయాల భారీ బడ్జెట్‌ను కేటాయించడం విశేషం.

Ramcharan Peddi: దీపావళికి రామ్‌చరణ్‌ పెద్ది?

ఈ చిత్రంలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా నటించారు. జయరాం, ఎస్‌జే సూర్య, సునీల్, ప్రియదర్శి ఇతర కీలక పాత్రల్లో నటించారు. తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఇక ‘గేమ్‌చేంజర్‌’లోని ముఖ్యమంత్రి పాత్రలో శ్రీకాంత్‌ కనిపిస్తారు.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos