లవర్‌బాయ్‌గా, పక్కింటి కుర్రాడిలా, సాఫ్ట్ పర్సన్‌లా ఇప్పటివరకు నాని సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ తన 25వ సినిమా ‘వి’లో మాత్రం కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిక్ క్యారెక్టర్ చేశాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లోని ఈ మూవీలో సుధీర్‌బాబు మరో హీరోగా చేశాడు. ‘వి’ మూవీ తర్వాత నాని, మళ్లీ అలాంటి రోల్ చేయలేదు. మళ్లీ ఇప్పుడు ‘హిట్ 3’ (Nani HIT3 Movie First Review) సినిమాతో ఆ తరహా జానర్‌ను టచ్ చేసినట్లుగా తెలుస్తోంది.
HIT3 Review: మితిమీరిన హింస..పెద్దలకు మాత్రమే…!
హిట్ సినిమా ఫ్రాంచైజీ నుంచి వస్తున్న థర్డ్ ఫిల్మ్ ‘హిట్ 3’ (Hit3). ఈ ఫ్రాంచైజీకి నానియే నిర్మాతగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకుడు. ‘హిట్ 1’ (HIT1)లో విశ్వక్‌సేన్, ‘హిట్ 2’ (Hit2)లో అడివి శేష్ హీరోగా చేశారు. ‘హిట్ ది థర్డ్ కేస్’లో మాత్రం నానీయే హీరోగా నటించి, నిర్మించారు. ఆయన భార్య ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాకు మరో నిర్మాత. ‘హిట్ 3’ చిత్రం మే1న విడుదల అవుతోంది. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు కమర్షి యల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా…‘హిట్ 3’ సినిమా ఉంటుందని నానీ చెప్పేశాడు. అలాగే ‘హిట్ 3’ సినిమాలో మితిమీరిన హింసాత్మక సన్ని వేశాల మోతాదు చాలా ఎక్కువ. అందుకే సెన్సార్ వాళ్లు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే 18 సంవత్సరాల వయసులోబడిన వారు, మా ‘హిట్ 3’ సినిమాను చూడొద్దని నానీ అండ్ టీమ్ ముందే చెప్పేసింది. సో..దిన్ని బట్టి ‘హిట్ 3’ మూవీలో హింసాత్మక సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు.
కథ ఎలా ఉండబోతుంది?
కమర్షియల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాబట్టి..రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కొంత కథ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నానీ, మృదుల పాత్రలో హీరోయిన్ శ్రీనిధిశెట్టి కనిపిస్తారు. 40 సంవత్సరాలు పైబడిన పోలీసాఫీసర్‌గా నాని కనిపిస్తాడు. అందుకే నాని హెయిర్ కాస్త వైట్‌లో ఉం టుంది. అర్జున్ సర్కార్‌గా నానీ ట్రాక్ రికార్డ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. మూడు సస్పెన్షన్స్..ఎనిమిది ట్రాన్ఫ ర్స్ అంటే…మరి..పోలీస్‌గా అర్జున్ సర్కార్ (Hit3 nani Charecter name) ఎలాంటివాడో ఊహించుకోవచ్చు. కశ్మీర్‌లో హీరో ఎంట్రీ సీన్ ఉంటుంది. ఓ పాప కిడ్నాప్ కేసు గురించి, కశ్మీర్ నుంచి వైజాగ్ వస్తాడు అర్జున్ సర్కార్. ఈ ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్ మీదగా, జైపూర్‌కు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది చూడాలి. ‘హిట్ 1’, ‘హిట్ 2’ సినిమాల్లో ఎవరు హత్యలు చేశారు? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు ఉంటాయి. కానీ…‘హిట్ 3’లో మాత్రం ఎందుకు చేశారు? ఎలా చేశారు? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా సాగుతుందనీ నాని యే చెప్పారు. అలాగే మృదుల పాత్రలో మరో లేయర్ ఉంటుంది. అది సస్పెన్స్. మృదులకు ఓ ఫైట్ సీక్వెన్స్ ఉందని, ఈ చిత్రం ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ చెప్పారు.సో…ఇన్వెస్టిగేషన్‌లో మృదుల రోల్ ఏం టి? అనేది కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.

సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి!
‘హిట్ 1’లో ఇంటెన్స్ పోలీసాఫీసర్ విక్రమ్ రుద్రరాజుగా చేసిన విశ్వక్‌సేన్, ‘హిట్ 2’లో కూల్ కాప్ కృష్ణదేవ్‌గా చేసిన అడివి శేష్‌లు ‘హిట్ 3’లో కూడా ఉంటారనే వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనడం, అడివి శేష్‌తో ఓ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తీశానని, ఈ చిత్రం ఫైట్ మాస్టర్ రియల్ సతీస్ చెప్పడం..వంటి అంశాలు…‘హిట్ 3’ మూవీలో విశ్వక్‌సేన్, కృష్ణదేవ్‌ల ఇన్వాల్వ్‌మెంట్‌ని కన్ఫార్మ్ చేస్తున్నాయి. ఇక ‘హిట్ 3’ చివర్లో..‘హిట్ 4’ క్లిప్ హ్యాంగర్‌గా..కార్తీ ఎంట్రీ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇంకా సినిమాలో చివరి 30 నిమిషాలు చాలా కీలకమని ‘హిట్ 3’ బృందం చెబుతోంది. సో..క్లైమాక్స్‌లో నానీ చేసిన అర్జున్ సర్కార్ రోల్ ఆర్క్ రివీల్ అయ్యే చాన్సెస్ ఉంటాయనిపిస్తోంది.
#HIT3PrereleaseEvent #HIT3FromMay1st #HIT3TheThirdCase #HIT3 #Nani #Rajamouli pic.twitter.com/z9aSUWsRpU
— TollywoodHub (@tollywoodhub8) April 27, 2025
టెక్నికల్‌గా స్ట్రాంగ్
‘హిట్ 3’ సినిమా టెక్నికల్‌గా చాలా బలంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు సాఫ్ట్ మ్యూజిక్ అందించిన మిక్కీ జే మేయర్… విరాట్‌కర్ణ ‘పెదకాపు’ సినిమాకు, కాస్త మాస్ మ్యూజిక్ ఇచ్చారు. కానీ. .‘హిట్ 3’ సినిమాకు ఆయన మ్యూజిక్ మ్యాజిక్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, ముఖ్యంగా ‘ఆర్‌ఆర్’ అదిరి పోతుందని అంటున్నారు. షాను కెమెరా వర్క్‌ను గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇక ముఖ్యంగా.. ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర…వర్క్‌ను గురించి, ఆడియన్స్ ప్రత్యేకంగా చెప్పుకుంటారనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో కీలకమని చెప్పుకునే చివరి 30 నిమిషాల క్లైమాక్స్ ఏపిసోడ్…ఈయన వేసిన సెట్‌లోనే జరుగు తుంది.
అదిరిపోయే ఓపెనింగ్స్

సంక్రాంతికి వచ్చిన…వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత..మరో లెవల్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు నాని ‘హిట్ 3’ వస్తుంది. ‘హిట్ 3’ సినిమాకు మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఓవర్‌సీస్‌లోనూ ‘హిట్ 3’ సినిమాకు టీమ్ ఊహించిన దానికంటే..ఎక్కువగానే రెస్పాన్స్ వస్తుం డటం విశేషం. ‘హిట్ 3’ సినిమాకు ముందే…ఓటీటీ, శాటిలైట్…బిజినెస్ పూర్తయింది. బడ్జెట్ ఆల్రెడీ 90 శాతం రికవరీ అయి పోయిందని అంటున్నారు. ‘హిట్ 3’ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 60 కోట్ల రూపాయల పైనే అని టాక్. మరి…థియేట్రికల్‌గా ‘హిట్ 3’ మూవీ ఎంత రెవెన్యూ కలెక్ట్ చేస్తుందో చూడాలి.