Suriya Retro movie Review: దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే క్రేజీనెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా ఉంటాయి. పేటా, జగమే తంతిరం, పిజ్జా, జిగర్తాండ…ఇలా ఆయన సినిమాలు కొత్తగా ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్ తాలుకూ హీరోయిజం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు ‘రెట్రో’ అనే లవ్‌స్టోరీ మూవీ తీశాడు. లవ్‌స్టోరీ సినిమాల్లో ఆరితేరిన సూర్య హీరోగా చేశారు. వెండితెరపై ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్‌గా కనిపించిన పూజాహెగ్డే.. తొలిసారి రెట్రో మూవీ కోసం కాస్త డీగ్లామరస్ రోల్ చేశారు. ఇటు ‘కంగువ’ వంటి ఫ్లాప్ మూవీ తర్వాత సూర్య నుంచి వస్తున్న సినిమా ‘రెట్రో’ (Suriya Retro movie Review). సో..ఆటోమేటిక్‌గా సూర్య ఫ్యాన్స్ ‘రెట్రో’ (Retro review) మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మరి..ఈ మూవీ ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
కథ ఎలా ఉండబోతుంది!
రెట్రో (Retro movie Review) మూవీ టీజర్, ట్రైలర్ చూస్తుంటే…ఈ సినిమా ఏదో గ్యాంగ్‌స్టర్ మూవీలా అనిపిం చవచ్చు. అయితే ఈ చిత్రంలో సూర్య (Suriya) గ్యాంగ్‌స్టర్ రోల్ చేసింది మాత్రం నిజం. అలా అనీ ఈ మూవీ గ్యాంగ్‌స్టర్ మూవీ కాదు. ఈ సినిమా మెయిన్ పాయింట్ లవ్‌స్టోరీయే. అగ్రెసివ్ అ యిన ఓ గ్యాంగ్‌స్టర్ లవ్‌లో పడితే, అతని జీవితం ఏమైంది? అన్నదే ఈ సినిమా కథనంగా తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ పారి పాత్రలో సూర్య కనిపిస్తారు. రుక్మిణీగా పూజాహెగ్డే (Poojahegde in Retro) కనిపిస్తారట.హింసను అంతగా ఇష్టపడని రుక్మిణీ కోసం పారి తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు? తన గతం తనని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది? అనే స్ట్రాంగ్ పాయింట్స్ ఈ మూవీ ఉండొచ్చు.

కొన్ని సీన్స్‌లో సూర్య జైల్లో ఉన్నట్లు కూడా చూపించారు. సో..కథలో సూర్య ఎందుకు జైలుకు వెళ్తాడు? అన్న పాయింట్ కూడా ఆసక్తికరమే. కేవలం లవ్, గ్యాంగ్‌స్టర్ మూమెంట్స్ యే కాకుండా…కథలో ఫాదర్–సన్ ఎమోషన్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కాక పోతే..అది పాజిటివ్‌నా, లేకపోతే నెగటివ్‌నా..అన్నది సస్పెన్స్‌గా ఉంటుంది. ఇంకా డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్స్ కూడా కీలకమే ఈ సినిమాలో. అప్పుడే కథ హీరో హీరోయిన్ల మధ్య కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అయ్యేది. ఆడియన్స్‌కు సినిమా నచ్చేది. కార్తీక సుబ్బరాజ్ మ్యాజిక్ స్క్రీన్ ప్లే, సంతోష్‌నారాయణన్ సంగీతం వర్కౌట్ అయితే…చాలు…సూర్య ఖాతాలో మరో హిట్ పడ్డట్లే.

జయరాం, జోజూజార్జ్, కరుణాకరన్, ప్రకాష్‌రాజ్, నాజార్, స్వాశిక ..ఇలా సినిమాలో మంచి నటీనటులు ఉన్నారు. ఇంకా శ్రియ చేసిన స్పెషల్ సాంగ్ కూడ ఉంది. ఎమోషన్స్, వయోలెన్స్ లకు తోడుగా…కూసింత కామెడీ సెట్ అయితే..రెట్రో మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. సూర్య గత చిత్రం ‘కుంగవ’ రిజల్ట్‌తో సంబంధం లేకుండా..ఆడియన్స్ ‘రెట్రో’ సినిమాను బుక్ చేస్తున్నారు. మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. సినిమాకు కూడ పాజిటివ్ టాక్ వస్తే…రెట్రో హిట్ తమిళంలో హిట్ కొట్టినట్లే. పైగా తమిళంలో పబ్లిక్ హాలీడే మే 1న రిలీజ్ అవుతున్న సినిమా రెట్రో మూవీయే. తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. మరి..ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. సినిమా నిడివి అయితే..2 గంటల 48 నిమిషాలు ఉన్నట్లుగా ఉంది. ఇప్పటి రోజుల్లో ఇది కాస్త పెద్దదే. మరి…స్క్రీన్‌పై ఏం మ్యాజిక్ చేసి ఆడియన్స్‌ను థియేటర్స్‌లో కార్తీక్ సుబ్బరాజు కూర్చొ బెడతారో చూడాలి.
References:
Grand mondial casino https://literaryforge.blog/author/potatocrook13/
References:
Casino william hill https://lilyrokg138170.dbblog.net/14883695/casino-of-gold-dein-ultimativer-guide
References:
Premier casino https://spinarium-casino.online-spielhallen.de/
References:
Spielhallen online https://kingmaker-casino-erfahrungen.online-spielhallen.de/
References:
Best online translator https://candidates.giftabled.org/employer/fast-payments