రామ్‌చరణ్ ‘పెద్ది’, నాని ది ప్యారడైజ్ (The Paradise)’ సినిమాలు ఒకరోజు గ్యాప్‌లో థియేటర్స్‌లో రిలీజ్ కానున్నాయి. నాని ‘ది ప్యారడైజ్’ సినిమాను మార్చి 26న రిలీజ్ చేస్తుంటే, ‘పెద్ది’ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానుంది. ఒకవైపు రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంటే, మరోవైపు ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ మాత్రం కాస్త నెమ్మదించింది. నిజానికి ‘హిట్ 3’ సినిమా రిలీజైన వెంటనే..నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో పాల్గొనాల్సింది. కానీ ‘హిట్ 3’ సినిమాకు మంచి టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం సరైన రిజల్ట్ అయితే రాలేదు. పైగా ఓ కాపీరైట్ కేసు కూడా ‘హిట్ 3’ సినిమా విషయంలో నడుస్తోంది. అందుకెనెమో…నాని కాస్త ఆలస్యంగా ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే…’ది ప్యారడైజ్’ (The Paradise update) సినిమా చిత్రీకరణలో నాని ఆలస్యంగా జాయిన్ అవుతున్నాడు.
The Paradise update: ది ప్యారడైజ్‌హైదరాబాద్ సెట్‌లో 40 రోజుల షూటింగ్
‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ కొత్త షెడ్యూల్‌లో హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో జరుగుతుంది. దాదాపు నలభైరోజులు ఈ సినిమా సెట్స్‌లోనే నాని ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ జరగనుంది. ప్రధానతారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారు. పీరియాడికల్ మూవీగా రానున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో సికింద్రబాద్ యువకుడిగా నాని కనిపిస్తాడు. నానికి విలన్‌గా మోహన్‌బాబు (MohanBabu) నటిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన మేకర్స్, ‘ది ప్యారడైజ్’ సినిమాను మార్చి 26నే రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో రామ్‌చరణ్ ‘పెద్ది’తో నాని బాక్సాఫీస్ క్లాష్ తప్పేలా లేదు. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘ది ప్యారడైజ్’ సినిమా వస్తుంది. దసరా సినిమాను మార్చి చివర్లో రిలీజైంది. దీంతో ‘ది ప్యారడైజ్’ సినిమానూ మార్చి చివరి వారంలో రిలీజ్ చేస్తున్నారు. బహుశా…నాని సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.
మరోవైపు రామ్‌చరణ్ హిట్ సినిమాలు ‘రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్’ మార్చి చివరి వారంలోనే విడుదల అయ్యాయి. దీంతో రామ్‌చరణ్ కూడా సెంటిమెంట్‌ను నమ్ముతున్నారట. మరి..మార్చిలో ఏం జరుగుతుందో చూడాలి. మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు.