ఒక్కరూ…తగ్గినా..ఇద్దరూ గెలిచినట్లే..!

Peddi vs ThePradise: రామ్‌చరణ్‌ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' చిత్రాలు ఒక రోజు గ్యాప్‌లో బాక్సాఫీస్‌ వద్ద పోటీపడుతున్నాయి.

Viswa
3 Min Read
Ramcharan Peddi_ Nani The Paradise

Web Stories

రామ్‌చరణ్‌ ‘పెద్ది’, నాని ‘ది ప్యారడైజ్‌’ సినిమాలు ఒకరోజు గ్యాప్‌లో థియేటర్స్‌లోకి వస్తున్నాయి (Peddi vs ThePradise). దీంతో బాక్సాఫీస్‌ వద్ద పెద్ద క్లాష్‌ ఉండబోతుందని ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

నిజమే…ముందుగా అనుకున్నట్లుగా నాని ‘ది ప్యారడైజ్‌’ మూవీ మార్చి 26న, రామ్‌చరణ్‌ పెద్ది మార్చి 27న విడుదల అయితే…ఈ రెండు చిత్రాలూ నష్టపోతాయి. కలెక్షన్స్‌ తప్పకుండ షేర్‌ అవుతాయి.

గేమ్‌చేంజర్‌ వంటి డిజాస్టర్‌ తర్వాత రామ్‌చరణ్‌ (Ramcharan) నుంచి వస్తున్న పీరియాడికల్‌ మల్టీస్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సాన (Peddi Director buchhibabu) ఈ సినిమాకు దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్‌రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌ పతాకాలపై వెంకట సతీష్‌ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్‌ కథనాయిక. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్వేందు శర్మ ఇతర కీ రోల్స్‌ చేస్తున్నారు.

అయితే పెద్ది సినిమా మార్చి 27న విడుదల అవుతుంది. సో…ఈ రోజు రామ్‌చరణ్‌ బర్త్‌ డే కాబట్టి… మెగా ఫ్యాన్స్‌ అందరూ పెద్ది సినిమానే ఫ్రిపర్‌ చేస్తారు. ఇది కచ్చితంగా నానికి ‘ది ప్యారడైజ్‌’ (TheParadise) బాక్సాఫీస్‌ సిని మాకు పెద్ద ఎదురుదెబ్బే.పైగా చరణ్‌ నుంచి మార్చిలో మూవీ విడుదల అయితే అదీ సూపర్‌హిట్‌ అవు తుంది. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’, రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (ఎన్టీఆర్‌ మరో హీరో) చిత్రాలు మార్చి చివర్లో విడుదల అయిన చిత్రాలే. ఈ సెంటిమెంట్‌ కూడా కలిసి రావొచ్చు.

‘పెద్ది’ సినిమా కావొచ్చు…‘ది ప్యారడైజ్‌’ మూవీ కావొచ్చు…రెండూ పీరియాడకిల్‌ ఫిల్మ్స్‌యే.
పెద్ది ఉత్త రాంద్ర నేపథ్యం అయితే…‘ది ప్యారడైజ్‌’ సికింద్రాబాద్‌ నేపథ్యం.
పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, ప్యారడైజ్‌ సినిమా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల..ఇద్దరూ…దర్శకుడు సుకుమార్‌ శిష్యూలే.

పైగా ..ఈ రెండు సినిమాలు…హీరో ఐడెంటినీని గురించిన సినిమాలే. సో..కోర్‌ పాయింట్‌ కామన్‌..

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే…ఈ ఇద్దరు దర్శకుల తొలి సినిమాలు రూ. 100 కోట్ల బాక్సాఫీస్‌ మైలురాయిని చేరుకున్నవే.
ఇద్దరికీ..ఇది రెండో సినిమా.

ఇటు నాని కూడా వరుస బాక్సాఫీస్‌ సక్సెస్‌లతో దూసుకెళ్తున్నారు. మే 1న రిలీజ్‌ అయ్యే నాని ‘హిట్‌ 3’ మూవీ పెద్ద విజయం సాధిస్తే, నాని రేంజ్‌ మరింత పెరుగుతుంది. ఇక తనతో ‘దసరా’ మూవీ తీసిన శ్రీకాంత్‌ ఓదెలతో నాని ‘ది ప్యారడైజ్‌’ మూవీ తీస్తున్నాడు. దసరా సినిమా తెలుగులో మాత్రమే ఆడింది. అతి కష్టం మీద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. మిగతా భాషల్లో ఫ్లాప్‌ మూవీనే. ఇప్పుడు ప్యారౖడైజ్‌ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

కానీ..నాని సినిమా ఇప్పటివరకు ఓ పెద్ద హీరో సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడింది లేదు. ఈ సీనా రియో..ఎలా ఉంటుందో నానికి తెలియక పోవచ్చు. పైగా..ఆల్రెడీ విజయ్‌దేవరకొండ ఫ్యాన్స్‌తో నానికి సోషల్‌æప్రపంచంలో నెగటివ్‌ తాకిడి ఎదురు అవుతుంది. ఇప్పుడు మెగాఫ్యాన్స్‌ తాకిడి కూడా తాకితే..నానికి ఇబ్బందులు ఎదురు కావొచ్చు..

గేమ్‌చేంజర్‌ తర్వాత…రామ్‌చరణ్‌కు పెద్ద హిట్‌ అవసరం…అలా పెద్ది హిట్‌ కావాలి. నాని రేంజ్‌ పెరగాలంటే…ది ప్యారడైజ్‌ హిట్‌ కావాలి…ఇద్దరు బాక్సాఫీస్‌ కోట్లాటకు దిగితే..ఇద్దరు నష్టపోతారు. మరోకరు అందలం ఎక్కుతారు.. అందుకే ..ఈ ఇద్దరులో ఎవరు తగ్గినా..తగ్గిన వాళ్లు..బరిలో నిలిచిన
వాళ్లూ గెలచినట్లే…ఏం జరుగుతుందో చూద్దాం.

 

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak