Prabhas: గాయపడ్డ ప్రభాస్‌…జపాన్‌ టూర్‌ క్యాన్సిల్‌

Viswa
1 Min Read

Prabhas: ప్రభాస్‌ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘బాహుబలి’ సినిమా జపాన్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబ ట్టింది. దీంతో ‘కల్కి2898ఏడీ’ సినిమాను కూడా జపాన్‌లో రిలీజ్‌ చేయాలని ప్రభాస్‌ అనుకున్నారు. ఇలా ‘కల్కి2898ఏడీ’ (Kalki2898ad) సినిమాను జనవరి 3న జపాన్‌లో రిలీజ్‌ చేసేందుకు సిద్ధమైయ్యారు. ఇందులో భాగంగా డిసెంబరు 18న జపాన్‌లో ఓ ప్రమోషనల్‌ ప్రొగ్రామ్‌ను ప్లాన్‌ చేశారు ‘కల్కి2898ఏడీ’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఈ ఈవెంట్‌లో ప్రభాస్, నాగ్‌ అశ్విన్‌ పాల్గొనాల్సింది. కానీ జపాన్‌కు ప్రభాస్‌ వెళ్లడం లేదు.

‘‘జపాన్‌ అభిమానులకు కలిసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కానీ కలవలేకపోతున్నాను. నా కాలికి గాయమైంది. త్వరలోనే కలుస్తాను’’ అంటూ ప్రభాస్‌ (Prabhas) ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఇలా ప్రభాస్‌ జపాన్‌ ప్లాన్‌ క్యాన్సిల్‌ అయ్యింది.

అయితే ప్రభాస్‌కు అయిన గాయం పెద్దది ఏమీ కాదట. అతి త్వరలోనే ప్రభాస్‌ కోలుకుంటారని తెలిసింది. ప్రస్తుతం దర్శకుడు మారుతితో రాజాసాబ్, హనురాఘవపూడితో ఫౌజి సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటు న్నాడు. అలాగే ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలోని ‘సలార్‌2’, సందీప్‌రెడ్డివంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ చిత్రాలకు ప్రభాస్‌ కమిటైయ్యారు. అలాగే ‘సలార్, కాంతార, కేజీఎఫ్‌’ సినిమాలను తీసిన కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్‌ మూడు పెద్ద సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే.

Share This Article
3 Comments