దర్శకుడు శంకర్‌కు ముగ్గురు టాప్‌ తెలుగు హీరోస్‌ నో చెప్పారా!

Viswa
1 Min Read

Web Stories

Director Shankar: కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌కు ముగ్గురు తెలుగు టాప్‌ హీరోలు నో చెప్పారంటే వినడానికి కాస్త ఆశ్చర్యం గానే ఉంటుంది. కానీ ఇది నిజమే. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్‌నే ధ్రువీకరించారు. తాను స్ట్రయిట్‌ తెలుగు మూవీ చేద్దామని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని, ఈ క్రమంలో హీరోలు చిరంజీవి, మహేశ్‌ బాబు, ఇటీవల కరోనా సమయంలో ప్రభాస్‌తో సంప్రదింపులు జరిపానని దర్శకుడు శంకర్‌ పేర్కొన్నారు. కానీ వారితో సినిమాలేవీ వర్కౌట్‌ కాలేదని, స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయాలన్న తన కల రామ్‌చరణ్‌ ‘గేమ్‌చేంజర్‌’ తో సాధ్యమైందని శంకర్‌ చెప్పుకొచ్చారు.

Mufasa: The Lion King Review: ముఫాసా: ది లయన్‌కింగ్‌ రివ్యూ

ఇక రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘గేమ్‌చేంజర్‌’ జనవరి 10న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేయగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ‘దిల్‌’ రాజు, శిరీష్, జీ స్టూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త.

Upendra’s UI The Movie Review: ఉపేంద్ర యూఐ మూవీ రివ్యూ

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu