Suriya Retro Movie Telugu Review: సూర్య రెట్రో మూవీ రివ్యూ

Viswa
5 Min Read
Suriya Retro Movie Telugu Review: సూర్య రెట్రో మూవీ రివ్యూ

సినిమా: రెట్రో (Suriya Retro Movie Telugu Review)
ప్రధానతారాగణం: సూర్య, పూజాహెగ్డే, జోజూ జార్జ్, జయరామ్, ప్రకాష్‌ రాజ్, కరుణాకరన్, నాజర్, స్వస్థిక, సింగం పులి
దర్శకత్వం: కార్తీక్‌సుబ్బరాజు
నిర్మాణం: జ్యోతిక, సూర్య, కార్తీకేయన్‌ సంతానం, రాజశేఖర్‌ పాండియన్‌
సంగీతం: సంతోష్‌ నారాయణన్‌
ఎడిటింగ్‌:మహామ్మద్‌ అలీ
కెమెరా:శ్రేయాస్‌ కృష్ణ
విడుదల తేదీ:మే1, 2025
రేటింగ్‌:2.5/5

కథ

పారివేల్‌ కన్నన్‌ (సూర్య) పెద్ద గ్యాంగ్‌స్టర్‌. తనను ప్రేమించిన రుక్మిణి (పూజాహెగ్డే) కోసం హింసను వదిలేసి, సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. పారివేల్‌ మారి పోయాడని నమ్మిన రుక్మిణీ కూడా, అతన్ని ఇష్టపడి పెళ్లిచేసుకుంటుంది. కానీ ఆ పెళ్లి మండపంలోనే పారివేల్‌…తనను పెంచిన తండ్రి తిలక్‌ (జోజూ జార్జ్‌) చేతిని నరికేయాల్సి వస్తుంది. దీంతో పారివేల్‌ హింసను వదులుకోలేదని, రుక్మిణీ పారివేల్‌ని వదిలేసి, అండ మాన్‌లోని బ్లాక్‌ ఐలాండ్‌కి వెళ్లిపోతుంది. పారివేల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అయితే పెళ్లికి ముందు ఆఫ్రికా పోర్ట్‌కు పెద్ద స్థాయిలో వచ్చిన బంగారాన్ని పారివేల్‌ ఎక్కడో దాచిపెడతాడు. ఈ బంగారం ఎక్కడుందో అన్న రహాస్యాన్ని తెలుసుకోవడానికి పారివేల్‌ మారు తండ్రి, రాజకీయ నాయకుడు ధర్మ (ప్రకాష్‌రాజ్‌) ప్రయత్నాలు చేస్తుంటారు. మరోవైపు బ్లాక్‌ ఐలాండ్‌లోని కింగ్‌ మైఖేల్‌ (యాక్టర్‌ విధు)గ్యాంగ్‌ కూడా పారివేల్‌ దాచిన బంగారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది (Retro movie Review)

ఈ క్రమంలో జైలులో ఉన్న పారివేల్‌కి రుక్మిణీ అండమాన్‌ బ్లాక్‌ ఐలాండ్‌లో ఉందని తెలిసి, ఆమె ప్రేమను సొంతం చేసుకోవడానికి వెళతాడు. వెళ్లి తాను మళ్లీ మారిపోయినట్లుగా, రుక్మిణీని నమ్మిస్తాడు. కానీ..పారివేల్‌ ఏం మారలేదని రుక్మిణీకి తెలుస్తుంది. దీంతో మరోసారి పారివేల్‌ని ద్వేషించి, అతన్నుంచి దూరంగా వెళ్లిపోతుంది రుక్మిణీ. మరోవైపు బంగారం కోసం పారివేల్‌ ఉన్న బ్లాక్‌ ఐలాండ్‌కు మైఖేల్‌ గ్యాంగ్‌ వస్తుంది. పారివేల్‌ తండ్రి కూడా వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఫైనల్‌గా..పారివేల్‌–రుక్మిణీల ప్రేమ గెలుస్తుందా? పారివేల్‌ బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టాడు? కింగ్‌ మైఖేల్‌ చేతిలో హింసకు గురి అవుతున్న తెగకు –పారివేల్‌కు ఉన్న కనక్షన్‌ ఏమిటి? అన్నది వెండితెరపై చూడాలి (Suriya Retro Review)

విశ్లేషణ

హీరో హింసాత్మకంగా ఉండటం, హీరో హింసాత్మక ప్రవర్తన హీరోయిన్‌కి నచ్చకపోవడం, ఆ తర్వాత హీరోయిన్‌ కోసం హీరో మారినట్లు, యాక్ట్‌ చేయడం…హీరోయిన్‌కు ఈ విషయం తెలి యడం…అనే ఈ రోటీన్‌ టెంప్లెట్‌ స్టోరీ లైన్‌ ఇప్పటీది కాదు. ఈ టెంప్లెట్‌నే రెట్రో మూవీలో కూడా సాగు తుంది. కానీ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు….హీరో–హీరోయిన్లను ప్రజెంట్‌ చేసిన తీరు బాగుంటుంది (RetroMovie).కథ డిఫరెంట్‌ టైమ్‌లైన్స్‌లో ఉంటుంది. పీరియాడికల్‌ ఫిల్మ్‌ ఇది. 1960- 1995 టైమ్‌ పీరియడ్‌లో ఉంటుంది.

Suriya Retro Movie Review News in telugu
Suriya Retro Movie Review News in telugu

సినిమా ప్రారంభంలోనే పెళ్లిమండపంలోని భారీ సీక్వెన్స్‌ ఉంటుంది. పాట, ఫైట్, డైలాగ్స్‌ కోర్‌ ఎలిమెంట్స్‌..అన్నీ ఈ సీక్వెన్స్‌లోనే ఆడియన్స్‌కు అర్థం అవుతాయి. ఆ తర్వాత హీరో జైలుకి వెళ్లడం, హీరోయిన్‌ అండమాన్‌లో ఉందని తెలుసుకుని, హీరో అక్కడికి వెళ్లి, ఆమెను కన్విన్స్‌ చేసే సీన్స్‌తో ఇంట్రవెల్‌ పడుతుంది. ఫస్ట్‌హాఫ్‌ బాగానే ఉన్నప్ప టీకిని, ఏదో సాగదీత ఫీలింగ్‌ అయితే వస్తుంది. ఇక సెకండాఫ్‌లో అయితే మరింత సాగదీత కనిపిస్తుంది. హీరో తనవాళ్ల కోసం చేసే ఫైట్‌ మాస్‌ ఆడియన్స్‌కు నచ్చవచ్చు. తొలిభాగం అంతా కోర్‌ పాయింట్‌ లవ్‌ అని చూపించిన దర్శకుడు, రెండో భాగంలో విముక్తి అనే పాయింట్‌ను డీల్‌ యాక్షన్‌తో డీల్‌ చేశాడు. ఇక్కడే చిన్న సమస్య. అసలు..హీరో పోరాటం..అతని ఉనికి
ఉన్న జనాల కోసమా? లేక రుక్మిణీ ప్రేమ కోసమా? అనే చిన్న డౌట్‌ ఆడియన్స్‌లో అయితే వస్తుంది.

Suriya 44 Movie Retro first look.jpg

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఒకే. అయితే ఈ సినిమాను లవ్‌.. లాఫ్టర్‌.. వార్‌ అంటూ..మూడు భాగాలుగా చూపించాడు దర్శకుడు. లవ్‌ ఒకే. యాక్షన్‌ బాగుంది. కానీ..నవ్వు మాత్రం ఈ సినిమాలో కాస్త బలవంతంగానే ఉంది. ముఖ్యంగా జయరాం సీన్స్, తొలిభాగంలో సూర్య కామెడీ ట్రై చేసే సీన్స్‌ సినిమాకు నప్పలేదెమో అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే జడముని గుడి నేపథ్యం, గిరిజన తెగ స్టోరీ కూడా…ఏం అంతంగా కుదర్లేదు. కార్తీక్‌సుబ్బరాజు…ఇంకా తన పాత చిత్రం ‘జిగర్తాండ డబుల్‌ఎక్స్‌’ సినిమా రైటింగ్‌ నుంచి బయటకు రాలెదెమో అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఫర్వాలేదు. కాకపోతే..కాస్త ఓపిగ్గా చూడాలి. దాదాపు మూడు గంటల నిడివి ఉంది.

ఎవరు ఎలా చేశారు?

పారివేల్‌ కన్నన్‌ పాత్రలో సూర్య (Suriya Retro) మంచి నటన కనబరచారు. యాక్షన్‌ ఎసిపోడ్స్, ఎమోషనల్‌ సీన్స్‌లో బాగా చేశాడు. ఈ సినిమాలో సూర్య తనకు నవ్వడం రాదు అంటారు. అలాగే ఈ సినిమాలోని కామిక్‌ సీన్స్‌కు ఆడియన్స్‌కు నవ్వు రాకపోవచ్చు. లవ్‌ సీన్స్‌లో సూర్య ఎప్పట్లానే బాగానే చేశాడు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం పూజాహెగ్డే. రుక్మిణీగా పూజాహెగ్డేకి మంచి బలమైన పాత్ర దొరికింది. సినిమాలో చాలా కీలకమైన పాత్ర ఇది. ఈ రోల్‌లో పూజా హెగ్డే బాగా చేశారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కగా చేశారు. కమర్షియల్‌ హీరోయిన్‌ రోల్‌ లోనే కాదు…రుక్మిణీలాంటి పెర్ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ను తాను సులభంగా పుల్‌ చేయగలనని నిరూపించారు పూజాహెగ్డే. పశువుల డాక్టర్‌ రోల్‌ చేశారామె.

హీరో మారు తండ్రి, స్మగ్లర్‌ కమ్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో జోజూ జార్జ్‌కి మంచి రోల్‌ దక్కింది. తొలిభాగంలో..సూర్య–పూజాహెగ్డేలకు దీటుగా, జోజూ జార్జ్‌ రోల్‌ ఉంటుంది. కానీ జోజూ జార్జ్‌లోని విలన్‌ రోల్‌ను..సెకండాఫ్‌లో మైఖేల్‌ (యాక్టర్‌ విధు) తీసుకున్నాడనిపిస్తుంది. ఇక నవ్వుల డాక్టర్‌గా జయరాం కామెడీ మిస్‌ఫైర్‌ అయ్యింది. ప్రకాష్‌రాజ్, నాజర్, సురేష్‌ మీనన్, శ్వాసిక వారి వారి పాత్రల మేరకు చేశారు. సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌ ఈ సినిమాలకు బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రియ స్పెషల్‌సాంగ్‌లో కనిపించారు. మహామ్మద్‌ అలీ విజువల్స్‌ బాగున్నాయి. ముఖ్యంగా బ్లాక్‌ ఐలాండ్‌లో సీన్నివేశాలవి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఫైనల్‌గా…లవ్‌ అండ్‌ యాక్షన్‌..నో లాఫ్‌ (కాస్త ఓపిగ్గా చూడాలి)

Nani HIT3 Cinema Review: హీరో నాని హిట్‌3 సినిమా రివ్యూ

 

 

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *