కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) కెరీర్ టాప్ లెవల్లో దూసుకెళ్తోంది. శివకార్తీకేయన్ లేటెస్ట్ మూవీ ‘మదరాసి’ సినిమా ఈ సెప్టెంబరు 5న థియే టర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా మదరాసి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఈ వేదికపై రుక్మిణీ వసంత్ నెక్ట్స్ సినిమాల లైనప్‌ను కన్ఫార్మ్ చేశారు నిర్మాత ఎన్వీప్రసాద్. అఫిషియల్‌గా రుక్మీణీవసంత్ లైనప్ సినిమాలు, లైమ్‌లైట్‌లోకి రావడంతో, ఒక్కసారిగా అందరు ఆశ్చర్య పోతున్నారు.
హీరో ఎన్టీఆర్– దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ అనే సినిమా చిత్రీకరణ జరుగు తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మీణీవసంత్ చేస్తున్నారు. జూన్ 25, 2026న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి యాక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘కాంతార’ ప్రీక్వెల్ ‘కాంతార చాప్టర్1’లో రుక్మీణీవసంత్ హీరోయిన్‌గా చేశారు. ఇందులో కనకావతి పాత్రలో కనిపిస్తారీ బ్యూటీ. ఇంకా ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’లో సైతం రుక్మీణీ వసంత్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇలా శివకార్తీకేయన్, రిషబ్‌శెట్టి, యశ్, ఎన్టీఆర్…వంటి టాప్ హీరోయిన్స్ సరసన నటించే చాన్స్‌లు దక్కించుకుని, రుక్మీణీవసంత్ ఒక్కసారిగా టాప్ హీరోయిన్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
కన్నడ హిట్ ఫిల్మ్ ‘సప్తసాగరాలు దాటి పార్టు 1’, ‘సప్తసాగరాలు దాటి పార్టు 2’ చిత్రాలతో రుక్మీణీ వసంత్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత రుక్మిణీకి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే నిఖిల్ హీరోగా చేసిన తెలుగు సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’లో రుక్మీణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. తెలుగులో ఆమెకు ఇది తొలి చిత్రం. ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. కన్నడలో శ్రీమురళి హీరోగా చేసిన ‘బఘీరా’ చిత్రంలోనూ రుక్మీణీ హీరోయిన్‌గా చేయగా, ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక శివకార్తీకేయన్ ‘మదరాసి’ సినిమా రుక్మీణీకి తమిళంలో తొలి సినిమా. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ ఆల్మోస్ట్ కన్ఫా ర్మ్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో రుక్మీణీ వసంత్‌కు చాన్స్ లభించింది.