Hrithik Roshan Responce on War2: హృతిక్‌రోషన్, ఎన్టీఆర్‌లు కలిసి చేసిన తొలి యాక్షన్ సినిమా ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లోని ఈ సినిమా యశ్‌రాజ్‌ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపుదిద్దుకుంది. ఎన్టీఆర్ హిందీలో చేసిన డైరెక్ట్ సినిమా ఇది. ఈ ఆగస్టు 14న ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి సరైన బాక్సాఫీస్ ఫలితం రాలేదు. దీంతో చిత్రంయూనిట్ నిరుత్సాహపడింది. అప్పట్నుంచి ఈ ‘వార్ 2’ సినిమా రిజల్ట్‌పై చిత్రం యూ నిట్ ఎక్కడ స్పందించలేదు. కానీ హృతిక్‌రోషన్ స్పందించాడు.
‘‘కబీర్‌ఖాన్ ( వార్ 1, వార్ 2 చిత్రాల్లో హృతిక్‌రోషన్ పాత్ర పేరు) పాత్ర గురించి నాకు తెలుసు, కనుక చాలా సులభంగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాను. అయాన్ నన్ను చక్కగా చూసు కున్నాడు. దేన్నైనా తెలిగ్గా తీసుకోకండి. నటుడిగా మీ బాధ్యతను వందశాతం చేయండి. మీ పని పూర్తి చేసిన తర్వాతే ఇంటికి రండి. ‘వార్ 2’ సినిమా విషయంలోనూ నేనే అదే చేశాను. నేను చేయాల్సింది చేశాను’’ అంటూ సుదీర్ఘమైన పోస్ట్‌ను ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు హృతిక్ రోషన్.
View this post on Instagram
కానీ ఎక్కడా..తన కో స్టార్స్ గురించిన ప్రస్తావన లేదు. ‘వార్ 2’లో హృతిక్‌రోషన్‌కు సమా నమైన పాత్ర పోషించిన ఎన్టీఆర్ పేరును హృతిక్‌రోషన్ స్పందించలేదు. నిర్మాత ఆదిత్య చోప్రా పేరునూ చెప్పలేదు. కేవలం దర్శకుడి పేరును మాత్రమే చెప్పారు. అలాగే ‘వార్ 2’ సినిమా రిజల్ట్ తర్వాత హ్రుతిక్ చేసిన తొలి పోస్ట్ ఇదే కావడం గమనార్హం
‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్‌ను భాగం చేయాలన్నది ‘వార్ 2’ నిర్మాత ఆదిత్యా చోప్రా ఐడియా. అయితే ‘వార్ 2’లోకి వచ్చిన తర్వాత స్క్రిప్ట్‌లో ఎన్టీఆర్ కొన్ని మార్పులు చేప్పారని, ఆదిత్యా చోప్రా కాదనలేక ఒకే చెప్పారని, దీంతో ఈ సినిమా రిజల్ట్ మారిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది.