జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచింది. భారతప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. తెలుగు సినిమా టాప్ స్టార్స్, ఇండియన్ సినిమా టాప్ స్టార్స్ ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ, ఈ దాడిలో అశువులు బాసిన వారికి సంతాపం తెలియజేశారు.
ఇదిలా ఉండగానే…ప్రభాస్(prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫౌజి’ (fouji) లో హీరోయిన్‌గా ఇమాన్వీ ఎస్మాయిల్ (Heroine Imanvi Esmail) యాక్ట్ చేస్తోంది. హనురాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ. 600 కోట్ల రూపాయాల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్న ఇమాన్వీ ఎస్మాయిల్ మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నాయని, ఆమె తండ్రి పాకిస్తాన్ మిలటరీకి చెందిన వారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో ‘ఫౌజి’ సినిమాపై నిషేదం విధిం చాలని, వెంటనే ఈ సినిమా చిత్రీకరణనను నిలిపి వేయాలని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు, నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దీంతో ఈ విషయంపై ఇమాన్వీ ఓ సుధీర్ఘమైన నోట్‌ను సోషల్‌మీడియాలో రిలీజ్ చేసింది.
‘‘ముందుగా జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని, ఆ విషాద సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీడియాలో నా గుర్తింపును గురించి, నా కుటుంబాన్ని గురించి, కొన్ని అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చాయి. నా ఫ్యామిలీలో ఒకప్పుడు కానీ, ఇప్పుడు కానీ…ఎవరూ పాకిస్తాన్ మిలటరీకి చెందిన వారు లేరు. ద్వేషాన్ని ప్రచారం చేయడానికే ఆన్‌లైన్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. దురదృష్ఠవశాత్తు, మీడియా కూడా నిజ నిజాలు పరిశోధన చేయకుండానే, ప్రచారంలోకి వచ్చిన విషయాలను నిజాలుగా భావించి, ప్రసారం చేస్తోంది.
— Imanvi (@Imanvi13) April 24, 2025
నేను ఇండో అమెరికన్‌ని. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలను. లాస్ ఏంజిల్స్‌లో జన్మించాను. నా తల్లిదండ్రులు యుక్త వయసులోనే అమెరికాకు వలస వెళ్లారు. ఆ ఆ తర్వాత అమెరికా పౌరులు అయ్యారు. యూఎస్‌ఏలో ఆర్ట్స్‌లో నేను చదువు పూర్తి చేసుకున్న తర్వాత యాక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. యాక్టర్, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ అయ్యాను. ఆ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూశాను. భారతీయ గుర్తింపు, సంస్కృతియే నాలోనూ ఉంది. నా రక్తంలోనూ ఉంది. దయచేసి, ప్రేమను పంచండి’’ అంటూ ఇమాన్వీ ఓ నోట్‌ను షేర్ చేసింది.