నిన్ను వదలిపెట్టను…నీ అంతు చూస్తా..అవతార్‌ 3 కొత్త ట్రైలర్‌ను చూశారా?

Viswa
Avatar Fire and Ash Poster

Web Stories

Avatar 3 New Trailer: జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలోని అవతార్‌ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు వచ్చిన రెండు చిత్రాలు ‘అవతార్, అవతార్‌2: ద వే ఆఫ్‌ వాటర్‌’ చిత్రాలు రికార్డు స్థాయి వసూళ్ళు సాధించడమే ఇందుకు నిదర్శనం. తాజాగా ‘అవతార్‌’ ఫ్రాంచైజీ నుంచి ‘అవతార్‌3: ఫైర్‌ అండ్‌ యాష్‌’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఉనా చాఫ్లిన్, క్లిఫ్‌ కర్టీస్, సిగౌర్రీ వీవర్, బ్రిటన్‌ డాల్టన్‌లు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ చిత్రం ఈ డిసెంబరు 19న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

ఆల్రెడీ ఈ సినిమాకు చెందిన తొలి ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. తాజా మరో కొత్త ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. తెలుగులో కూడా ఈ కొత్త ట్రైలర్‌ అందుబాటులో ఉంది. ‘అవతార్‌ 3’ సినిమా ప్రపంచభాషలతో పాటుగా, తెలుగు,తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. అందుకే ఈ ప్రాంతీయభాషల్లోనూ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు మేకర్స్‌. తెలుగు ట్రైలర్‌లోని డైలాగ్స్‌ ఈ కింది విధంగా ఉన్నాయి.

ఈ ప్రపంచంలోని విషయాలు నువ్వు ఊహించినదాని కన్నా లోతైనవి

నీ చెల్లెళ్ళు జాగ్రత్త…మీరు కనపడకుండ దాక్కోండి

సలీస్‌ ఓటమిని ఒప్పుకోరు….

మనం పోరాడి తీవాలి

నిన్ను వదలిపెట్టను…నీ అంతు చూస్తా

నీ అగ్గితో ఈ ప్రపంచాన్ని కాల్చి బూడిద చేయాలంటే నేను నీకు కావాలి

అలాగే అవతార్‌ 2 ద వే ఆఫ్‌ వాటర్‌ సినిమాను, ఈ అక్టోబరు 3న థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. ‘అవతార్‌ 2’ సినిమా వచ్చి చాలా రోజులైంది. దీంతో ఇప్పుడు అవతార్‌ 3 రాబోతుంది. ఈ తరుణంలో ‘అవతార్‌ 2’ సినిమాను రీ రిలీజ్‌ చేస్తే, అవతార్‌లోని పండోర గ్రహంను మరోసారి ఆడియన్స్‌ గుర్తు చేసినట్లుగా ఉంటుందని మేకర్స్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos