మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా ‘కన్నప్ప’ మూవీలోని పార్వతీదేవి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ‘కన్నప్ప’ మూవీ నుంచి ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. తన డ్రీమ్ రోల్ చేసినట్లుగా కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.
మంచు విష్ణు (ManchuVishnu) హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం, మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఈ చిత్రంలో శివుడి పాత్రలో అక్షయ్‌కుమార్, నందీశ్వరుడి పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. ముఖేష్‌కుమార్ ‘కన్నప్ప’ సినిమాకు దర్శకుడు.
మోహన్‌బాబు నిర్మిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇక గతంలో ‘మోసగాళ్ళు’ అనే మూవీలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్‌లు అన్నాచెల్లెళ్ళుగా యాక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఇంకా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హిందీలో నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ఉమ’ రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే కమల్‌హాసన్ చేసిన ‘ఇండియన్ 3’లో హీరోయిన్‌గా, సల్మాన్‌ఖాన్ ‘సికందర్’లో ఓ లీడ్ రోల్‌లో కాజల్ అగర్వాల్ యాక్ట్ చేస్తున్నారు. ‘సికందర్’ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.