please subscribe to Tollywoodhub YouTube channel

46 ఏళ్ల తర్వాత హీరో ఎవరు?

Viswa
1 Min Read

Web Stories

Kamalhasaan and Rajinikanth Movie KH-RK: రజనీకాంత్ (Rajinikanth), కమల్‌హాసన్‌ (Kamalhasaan) లు కలిసి నటించనున్న కొత్త సినిమా ప్రోమో విడుదలైంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొమోను బట్టి, ఈ సినిమా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్నట్లుగా తెలుస్తుంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించాల నుకుంటన్నారు. ఈ సినిమాకు అనిరు«ద్‌ రవి చందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. 2027లో ఈ సినిమా విడుదల కావొచ్చు.

ఇక రజనీకాంత్‌ కెరీర్‌లో ఇది 174వ సినిమా (Kamalhasaan and Rajinikanth Movie KH-RK). రజనీకాంత్‌తో ‘జైలర్, జైలర్‌ 2’ సినిమాను తీసిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌యే, రజనీకాంత్‌ తాజా సినిమాకూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇలా రజనీకాంత్‌తో వరుసగా మూడు సినిమాలు చేసిన ఘనత నెల్సన్‌ దిలీప్‌కుమార్‌కే చెందు తుందెమో.

#KHxRK Promo
#KHxRK Promo

మరోవైపు రజనీకాంత్‌తో కమల్‌హాసన్‌ రెండోసారి అసోసియేట్‌ అయ్యారు. రజనీకాంత్‌ 173వ సినిమాకు కమల్‌హాసన్‌ ఒక నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. సిబీ చక్రవర్తి ఈ సినిమాకు దర్శకుడు. ఇలా కమల్‌హాసన్‌ వరుసగా రెండోసారి రజనీకాంత్‌ మూవీతో అసోసియేట్‌ కావడం విశేషం.

ఇక 1970 సమయంలో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కలిసి దాదాపు 20కి పైగా సినిమాల్లో కలిసి యాక్ట్‌ చేశారు. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీన్‌ అద్భుత విళక్కుమ్‌’ సినిమా తర్వాతమళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా కన్ఫార్మ్‌ కావడం ఇదే.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi