హిందీలో మహాభారతం వంటి పలు సీరియల్స్ తీసి, మరి ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ముకేష్‌కుమార్ (Kannappa Director mukeshKumar) తొలిసారి దర్శకత్వం వహించిన ఫీచర్ ఫిల్మ్ ‘కన్నప్ప’ (Kannappa). మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. తిన్నడు నుంచి కన్నప్పగారే మారే పాత్రలో మంచు విష్ణు (Manchuvishnu Kanappa) నటించగా, ఇతర కీలక పాత్రల్లో మోహన్‌బాబు, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్ , శరత్‌కుమార్, బ్రహ్మానందంలు యాక్ట్ చేశారు. అయితే ‘కన్నప్ప’ సినిమా తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహాభారతం అంటున్నారు ముకేష్‌కుమార్. నేను మహాభారతం సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. అలా అని సినిమా నాకేం కొత్త కాదు. నిర్మాతగా నేను మూడు సినిమాలు నిర్మించాను. కన్నప్ప తర్వాత నా నెక్ట్స్ మూవీ ‘మహాభారతం’ ఆధారంగానే ఉంటుంది. మూడు పార్టులలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాను. యాక్టర్స్, టెక్నిషియన్స్, ప్రొడక్షన్, బడ్జెట్…ఇలా అన్ని వివరాలను కన్నప్ప సినిమా విడుదల తర్వాత చెబుతాను.
మహాభారతం ఆధారంగా సినిమా!
ఇక రాజమౌళి (Director Rajamouli) ,ఆమిర్‌ఖాన్‌గార్లు కూడా మహాభారతం (Mahabharatham Movie) ఆధారంగా సినిమాలు ప్లాన్ చేశారు. కానీ మహాభారతం అనేది పబ్లిక్ డొమైన్‌లో ఉంది. ఎవరైనా కథ చెప్పవచ్చు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ సంఘటనను గురించి, అక్కడ ఉన్న వారిని అడిగితే, ఒక్కోక్కరు ఒక్కో విధమైన కోణంలో చెబుతారు. అలాగే నా కోణంలో మహాభారతం సినిమా చెబుతాను. రాజమౌళి గారంటే నాకు ఎంతో గౌరవం. భారతీయ సినిమా గురించి, ఒకప్పుడు సత్యజిత్‌రే గారి గురించి మాట్లాడుకున్నారు. కానీ ఆయన ఆర్ట్ సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు రాజమౌళిగారి గురించి మాట్లాడుకుంటున్నారు. మెయిన్‌స్ట్రీమ్ ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లింది ఆయనే.
కన్నప్ప సినిమా గురించి..!
ఇక కన్నప్ప సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. 80 శాతం చిత్రీకరణ న్యూజిలాండ్‌లో చేశాం. అక్షయ్‌కుమార్, ప్రభాస్ ఎపిసోడ్స్‌కు సంబంధించిన సన్నివేశాలను భారత్‌లో చిత్రీకరించాము. తొలుత న్యూజిలాండ్‌లో ఇరవై రోజుల షూటింగ్ మాత్రమే అనుకున్నాను. కానీ..విష్ణుగారు మేజర్ షూటింగ్ ఇక్కడే చేద్దామని చెప్పారు. పైగా మేం ఏ సమయంలో అయితే కన్నప్ప చిత్రీకరణ చేశామో, ఆ సమయంలో ఇండియా లొకేషన్స్‌తో చిత్రీకరించడం కష్టం. అందుకే న్యూజిలాండ్‌లో చేయాల్సి వచ్చింది. మోహన్ బాబుగారి పాత్ర విభిన్నంగా ఉంటుంది. పాన్ ఇండియాస్టార్ ప్రభాస్‌గారి పాత్ర ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఆ సినిమాలో ఆయన చేసిన రుద్ర పాత్ర వల్ల ఆయన అభిమానులు ఏమాత్రం నిరుత్సాహపడరని చెప్పగలను.
కన్నప్ప సినిమాకు సంబంధించి ఏంతో రీసెర్చ్ చేశాను. కన్నప్ప జీవితం ఆధారంగా వచ్చిన సినిమాలు, వీడియోలు అన్నీ చూశాను. భాష తెలియపోతే నా అసిస్టెంట్ సాయం తీసుకున్నాను. కన్నప్ప సినిమా ఆడియన్స్‌కు తప్పకుండ నచ్చుతుంది. విష్ణు బాగా చేశాడు.