సర్దార్ (Karthi Sardar2) కొత్త మిషన్ పూర్తయింది. తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘సర్దార్’ (Karthi Sardar) 2022లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ను తీశారు ఈ చిత్రం దర్శకుడు పీఎస్ మిత్రన్. ‘సర్దార్’ సినిమాలో నీరు ప్రాముఖ్యత, నీటి కోసం అంతర్జాతీయ స్థాయిలో జరిగే కుట్రలు…వంటి అంశాలను చక్కగా చూపించాడు దర్శకుడు పీఎస్ మిత్రన్. మళ్లీ ఇప్పుడు మరో కొత్త టాస్క్‌తో వచ్చేందుకు రెడీ అయ్యాడు దర్శకుడు పీఎస్ మిత్రన్.
‘సర్దార్’కు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ (Sardar 2) సినిమా తీశారు కార్తీ, పీఎస్ మిత్రన్ (Director PSMithran). ఈ సినిమాలోనూ కార్తీ డ్యూయోల్ రోల్ చేశాడు. తొలిపార్టు క్లిప్‌హ్యాంగర్‌లో ఓ స్పై మిషన్ కోసం యంగ్ కార్తి కంబో డియా వెళ్తున్నట్లుగా చూపించారు. ఈ పాయింట్‌తోనే ఈ సినిమా స్టార్ట్ కావొచ్చు. తాజాగా ‘సర్దార్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు మేకర్స్. థాయ్‌లాండ్‌లో జరిగిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తయింది. ఇక ఈ ఏడాదిలోనే ‘సర్దార్ 2’ను థియేటర్స్‌లోకి తీసుకురావాలన్నది చిత్రంయూనిట్ ప్లాన్‌గా తెలుస్తోంది. దీపావళికి రిలీజ్ కావొచ్చు. ఇక ‘సర్దార్ 2’లో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపిస్తారు. రజీషా విజయన్, ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తి కావడంతో, ‘ఖైదీ 2’పై ఫోకస్ పెట్టనున్నాడు కార్తీ. ‘ఖైదీ 2’ (Kaithi2) చిత్రీ కరణ ఇపాటికే మొదలు కావాల్సింది. కానీ ఈ చిత్రం దర్శకుడు లోకేష్ కనగరాజ్ …కమల్ హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాలు చేయాల్సి రావడంతో, ‘ఖైదీ 2’ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ఈ ఏడాదే ‘ఖైదీ 2’ చిత్రీకరణ ప్రారంభం కానుంది. వచ్చే వేసవిలోపు ‘ఖైదీ 2’ సినిమాను రిలీజ్ చేయాలన్నది లొకేష్ ప్లాన్ అట.