Keerthysureh: నిరాశలో కీర్తీసురేష్‌..ఆశలన్నీ ఆ వెబ్‌సీరీస్‌పైనే…

Keerthysureh: బాలీవుడ్‌ డెబ్యూ మూవీపై కీర్తీసురేష్‌ (Keerthysureh)ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ బేబీజాన్ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.

Viswa
1 Min Read

బాలీవుడ్‌ డెబ్యూ మూవీపై కీర్తీసురేష్‌ (Keerthysureh)ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమిళ హిట్‌ ఫిల్మ్‌ విజయ్‌ ‘తేరీ’ హిందీ రీమేక్‌ ‘బేబీజాన్‌’లో ఓ హీరోయిన్‌గా నటించారు కీర్తీసురేష్‌. వరుణ్‌ధావన్‌ హీరోగా నటించగా, తమిళ దర్శకుడు అట్లీ ఓ నిర్మాత. తమిళ దర్శకుడు కాలిస్‌ ‘బేబీజాన్‌’కు దర్శకుడు. ‘బేబీజాన్‌’ సినిమా డిసెంబరు 25న థియేటర్స్‌లో రిలీజైంది. సౌత్‌లో కాస్త ఫ్యామిలీ అమ్మాయిలా కనిపించిన కీర్తీ, ఈ సినిమా కోసం
కాస్త గ్లామరస్‌గా కూడా కనిపించారు. అయినా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

SSMB29: మహేశ్‌బాబు..రాజమౌళిల సినిమా ఓపెనింగ్‌ రేపే..!

దీంతో బాలీవుడ్‌లో తొలి మూవీ చేసిన కీర్తీసురేష్‌కు నిరాశ ఎదురైంది. పైగా ‘బేబీజాన్‌’ (Babyjhon) ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తీ సురేష్‌ ఫోటోలు దిగుతున్న సమయంలో అక్కడి ఫోటోగ్రాఫర్స్‌ కొందరు కీర్తీని కృతిని అని పిలిశారు. కృతి కాదు…కీర్తీ సురేష్‌ అని చెప్పారు కీర్తీ. ఆ తర్వాత అక్కడే మరో అతను కీర్తీదోశ అన్నారట. దీంతో కీర్తీ కాస్త ఇబ్బంది పడ్డారట.

Nagavamsi:తెలుగు ప్రముఖ నిర్మాత నాగవంశీపై బాలీవుడ్‌ దర్శకుల వ్యంగ్యాస్త్రాలు

బాలీవుడ్‌లో కీర్తీసురేష్‌ (KeerthySuresh) చేసిన తొలి మూవీ ‘బేబీజాన్‌’ వర్కౌట్‌ కాలేదు. దీంతో హిందీలో తాను కమిటైన ‘అక్క’ (Akaa)వెబ్‌సీరస్‌పైనే కీర్తీ ఆశలన్నీ పెట్టుకున్నారీప్పుడు. ఈ రివెంజ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లో రాధికా ఆప్టే మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ ఏడాదే ఈ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

నిజానికి కీర్తీసురేష్‌ బాలీవుడ్‌ డెబ్యూ ఎప్పుడో జరగాల్సింది. అజయ్‌దేవగన్‌ ‘మైదాన్‌’ మూవీలో తొలుత హీరోయిన్‌గా కీర్తీసురేష్‌ను తీసుకున్నారు మేకర్స్‌.ఆ తర్వాత ఈ రోల్‌ ప్రియమణికి దక్కింది.

KeerthySuresh Marriage: పదిహేనేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్న కీర్తీసురేష్‌

మరోవైపు కీర్తీసురేష్‌ వివాహం డిసెంబరులో గోవాలో జరిగింది. ఆంటోనీ తట్టిల్‌తో కీర్తీసురేష్‌ ఏడడుగులు వేశారు.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *