please subscribe to Tollywoodhub YouTube channel

చిట్టిజయపురం…స్మశానంలో చోటు కోసం లక్కీ డ్రా

Viswa

Web Stories

వెబ్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్‌ కీర్తీసురేష్‌ (Keerhysuresh). సుహాస్‌(Suhas)తో కలిసి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కోసం ‘ఉప్పుకప్పురంబు’ (Keerthysuresh Uppu Kappurambu) అనే ఓ వెబ్‌ ఫిల్మ్‌ చేశారు. వసంత్‌ మారింగంటి రచనతో, ఐవీ శశి దర్శకత్వంలో రాధిక లావు నిర్మించిన ఈ ‘ఉప్పుకప్పురంబు’ (Uppu Kappurambu) సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో జూలై 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘ఉప్పుకప్పురంబు (Uppu Kappurambu Movie OTT)’ సినిమా ట్రైలర్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.

1990 నాటి నేపథ్యంతో చిట్టిజయపురం అనే కల్పితగ్రామంలో జరిగే వివిధ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. చిట్టిజయపురం గ్రామంలో చనిపోయిన వారిని పూడ్చిపెట్టడానికి స్మశానంలో చోటు తక్కువ అవుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఫైనల్‌గా కేవలం నలుగురు మనుషులను పూ డ్చిపెట్టేందుకే స్మశానంలో స్థలం ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది? స్మశానంలోని ఆ నాలుగు ప్లేస్‌ల కోసం లక్కీ డ్రా నిర్వహిస్తే ఏం జరుగుతుంది? అనేది టూకీగా ఉప్పుకప్పురంబు సినిమా కథాం శంగా తెలు స్తోంది. ఈ చిత్రంలో ఊరిపెద్దగా కీర్తీసురేష్, కీర్తీసురేష్‌కు సహాయం చేసే వ్యక్తి చిన్నాగా సుహాస్‌ నటిం చారు. బాబుమోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేశారు. జూలై 4 నుంచి ఈ ‘ఉప్పుకప్పురంబు’ సినిమా తెలుగు,తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఒక సమాజిక సమస్యకు వ్యగ్యం, హాస్యం జోడించి, ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించినట్లున్నారు.

‘‘ఏంటి మీ సమస్య…

‘‘నిన్న మన స్మశానంలో తిరుగుతుంటే నాకో విషయం తెలిసిందండీ…ఇక నాలుగు స్థలాలే ఖాళీగా ఉన్నాయి..అంటే మన ఊర్లో ఇక నాలుగు శవాలు పూడ్చిపెట్టడానికి మాత్రమే చోటుంది…అదీ విషయం…’’ (కీర్తీసురేష్‌)

‘‘నాకైతే ఏమీ తెలియదు…మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా?’ (కీర్తీసురేష్‌)

‘‘నేను, చిన్నా కష్టపడి ఒక లిస్ట్‌ తయారు చేశాం..

‘సమాధి చోటు కోసం ఎవరైనా కొట్టుకుంటారా?అందరూ వచ్చి నాక్కావాలి…నాక్కావాలి..అంటే…’ (కీర్తీసురేష్‌)

‘‘ఆడదాన్ని ఊరి పెద్ద చేస్తే ఇలానే ఉంటుంది…’ (శత్రు)

‘స్మశానంలో చోటు కోసం ఒక లక్కీడ్రా జరుగుతుంది…’
‘దయచేసి ఎవరు చావొద్దని మనవి..’….ఇలాంటి డైలాగ్స్‌….‘ఉప్పుకప్పురంబు’ సినిమా తెలుగు ట్రైలర్‌లో ఉన్నాయి.

 

మరోవైపు కీర్తీసురేష్‌ రెండో వెబ్‌సిరీస్‌ కూడా చేశారు. రాధికా ఆప్టే ఇందులో మరో లీడ్‌ క్యారెక్టర్‌ చేశారు. ఈ స్పై యాక్షన్‌ డ్రామాపై మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi