టాలీవుడ్‌ దర్శకులు ఆ ధైర్యం ఎందుకు రావడం లేదో..!

Viswa
2 Min Read

Web Stories

Tollywood directors: రెండు పార్టులుగా వచ్చిన సినిమాలు రీసెంట్‌ టైమ్స్‌లో బాగానే సక్సెస్‌ అవుతున్నాయి. తెలుగులో అయితే ‘బాహుబలి ది బిగినింగ్‌’తో రాజమౌళి ఈ కల్చర్‌కు శ్రీకారం చుట్టూరు. ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా వచ్చింది. బాహుబలి ది బిగినింగ్‌ సినిమా 2015లో విడుదలైతే, బాహుబలి ది కన్‌క్లూజన్‌ సినిమా 2017లో రిలీజైంది. రెండూ బ్లాక్‌బస్టర్‌ సినిమాలే. ఆ తర్వాత స్టైల్లో దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప’ సినిమా తీశారు. తొలిపార్టు పుష్ప ది రైజ్‌ (2021), రెండో పార్టు పుష్ప ది రూల్‌ (2024) మధ్య మూడు సంవత్సరాల గ్యాప్‌. ఇదే స్పూర్తితో కావొచ్చు..కొరటాల శివ ‘దేవర’ సినిమాను రెండు పార్టులుగా చేశారు. తొలి పార్టు ఆల్రెడీ విడుదలైంది. మలిపార్టు సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ఇక తొలిపార్టును థియేటర్స్‌ లో వేసి, ఇది ఆడియన్స్‌కు నచ్చకపోవడంతో, మలిపార్టు ఆగిపోయిన తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు…విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్‌‘, రవితేజ ‘ఈగిల్‌’.

ఇక్కడ మరో కాయిన్‌ సైడ్‌ కూడ ఉంది. అది ఏంటంటే..మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను రెండు పార్టులుగా తీశారు. తొలిపార్టు ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’కు, మలిపార్టు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రిలీజ్‌లకు మధ్య తేడా ఆరు నెలలు. కన్నడ డైరెక్టర్‌ హేమంత్‌ ‘సప్తసాగరాలు దాటి’ సినిమాను రెండు పార్టులుగా అంటే..’సప్తసాగరాలు దాటి సైడ్‌ ఏ, సప్తసాగరాలుదాటి సైడ్‌ బి…ఇలా రెండు పార్టులుగా తీస్తే, వీటి రిలీజ్‌ల మధ్య గ్యాప్‌…40 రోజులన్నది నిజం. ఇప్పుడు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను దమ్ముదులుపుతున్న ‘ధురంధర్‌’ సినిమా కూడా రెండు పార్టులుగా వచ్చింది. ‘ధురంధర్‌ పార్టు1, ధురంధర్‌పార్టు2 సినిమాల మధ్య తేడా….నాలుగు నెలలు. ఇలా సినిమా మొత్తాన్ని ముందుగానే తీసేసి, ఆ తర్వాత పార్టులుగా రిలీజ్‌ చేస్తున్నారు ఇతర భాషల దర్శకులు.

రణ్‌వీర్‌సింగ్‌ ధురంధర్‌: ది రివెంజ్‌ రివ్యూ

తెలుగు దర్శకులు మాత్రం తొలిపార్టు విజయం సాధించిన తర్వాతే, మలిపార్టుపై ఫోకస్‌ పెడుతున్నారు. కథ మొత్తాన్ని కంప్లీట్‌ చేసి, ఇందుకు తగ్గట్లుగా రెండు పార్టులుగా రిలీజ్‌ చేసుకునే ప్లానింగ్‌ చేయడం లేదు. రెండు పార్టులుగా ఓ సినిమాను అనుకున్నప్పుడు…గ్యాప్‌ తక్కువగా ఉంటే ఫలితాలు బాగానే ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహరణ. .ధురంధర్‌2. బాహుబలి2, పుష్ప ది రూల్‌ (పుష్ప 2) సినిమాలూ విజయాలు సాధించాయి. కానీ…రెండోసారి విడుదల చేసే సమయంలో ఈ టీమ్‌లు ఎంత పబ్లిసిటీ చేశాయో, ఇందుకోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో తెలిసిందే. కానీ రెండు పార్టులగా సినిమా వచ్చినప్పుడు గ్యాప్‌ పెద్దగా లేకపోతే…ఆడియన్స్‌ను త్వరత గతిన ఎంగేజ్‌ చేయవచ్చు.
పబ్లిసిటీ ఖర్చు కూడ తగ్గుతుంది.

తొలిపార్టు వచ్చిన రెండు మూడేళ్లకు రెండో పార్టు సినిమాలు వస్తున్నాయి. కల్కి2, సలార్‌2 ఇలానే రాబోతున్నాయి. కానీ ఒకేసారి రెండు పార్టులను చిత్రీకరించి, క్విక్‌ గ్యాప్‌లో రిలీజ్‌ చేసే ప్రయత్నాన్ని కూడ తెలుగు దర్శకులు ఓ సారి ట్రై చేస్తే మెరుగైన ఫలితాలే ఉండొచ్చు. నిర్మాతలు కూడ ఈ దిశగా ఆలోచించే ప్రయత్నం చేసి, దర్శకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Please Share
Share This Article
2 Comments
  • Кодирование — это медицинский инструмент, который помогает закрепить трезвость, но сам по себе не является «волшебной кнопкой». Его задача — усилить внутреннюю мотивацию и создать физиологические и/или психологические условия, при которых срыв становится маловероятным. В «НаркологЭксперт» кодирование включают в структуру лечения: сначала купируются острые проявления, проводится детокс и стабилизация сна, давления и тревоги, затем — диагностика противопоказаний, подробное информирование, выбор методики и только после этого — сама процедура. Такой порядок снижает риски, повышает переносимость и делает результат предсказуемым. Важно, что любая техника подбирается индивидуально с учётом длительности употребления, анамнеза, сопутствующих заболеваний и рабочей нагрузки пациента, чтобы лечение органично вписалось в реальную жизнь и не сорвалось на первых же неделях.
    Подробнее тут – kodirovanie-v-moskve-ceny

  • Госпитализация показана, когда требуется непрерывный контроль и быстрые изменения схем лечения. В стационаре устраняют выраженные симптомы отмены, корректируют электролитные нарушения, поддерживают печёночные функции, при необходимости подключают кислород и аппаратные методы диагностики. Параллельно выравнивают сон и аппетит, закрывают дефициты микроэлементов, подбирают щадящий режим нагрузки. На выписке пациент получает подробные рекомендации: как дозировать активность, когда пить воду и в каких объёмах, какие препараты принимать и при каких признаках обращаться за консультацией без ожидания. Такой формат снижает риск осложнений и даёт предсказуемую динамику уже на горизонте нескольких дней.
    Получить дополнительные сведения – клиника наркологии москва

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi