రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన యంగ్ హీరో.. ఒక్క సినిమాకి అన్ని కొట్లా?

Kumar NA

Web Stories

Kiran abbavaram one movie remuneration: సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల ఆయన నటించిన ‘క’, ‘కే ర్యాంప్’ వంటి విభిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఈ విజయాల పరంపరతో కిరణ్ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు.

వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న కిరణ్ అబ్బవరం, తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం కోసం ఆయన సుమారు రూ. 10 నుంచి 12 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు, ఆ సంస్థ కూడా దానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. కిరణ్ రెమ్యూనరేషన్ పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సక్సెస్ రేటును బట్టి పెంచడం సహజమేనని కొందరు అంటుంటే, నిర్మాతల హీరోగా పేరున్న కిరణ్ ఇలా రేటు పెంచితే భారం అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ కేవలం నటుడిగానే కాకుండా, సినిమాలోని ఇతర విభాగాలపై కూడా మంచి పట్టు సాధించారు.

తాను చేసే సినిమా కథ ఎలా ఉండాలి? ప్రేక్షకులకు ఎలా చేరువ కావాలి? అనే విషయాల్లో ఆయన పక్కా ప్లానింగ్‌తో ఉంటారు. షూటింగ్ నుంచి ప్రమోషన్ల వరకు అన్నీ తానై చూసుకోవడం కిరణ్ ప్రత్యేకత. తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అందుకే ఇప్పుడు నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. పరిశ్రమలో ఏదైనా విజయం చుట్టూనే తిరుగుతుంది. కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఆ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు కాబట్టి, ఆయన రేంజ్ పెరగడం సహజమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆయన చేయబోయే మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram