చెన్నైలవ్‌స్టోరీ…ఫస్ట్‌లవ్‌ తోపేం కాదు..

Viswa

‘క’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో కిరణ్‌ అబ్బవరం ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘దిల్‌ రుబా’ చిత్రం ప్రేక్షకులను, కిరణ్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ప్రజెంట్‌ కిరణ్‌ అబ్బవరం రెండు కొత్త సినిమాలు చేస్తున్నాడు. ఒకటి కె ర్యాంప్‌ అనే ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ. మరొకటి ‘చెన్నైలవ్‌స్టోరీ’. ఈ చెన్నైలవ్‌స్టోరీ (ChennaiLoveStory) సినిమా ఫస్ట్‌ టైటిల్‌ గ్లింప్స్‌ను ‘అర్జున్‌రెడ్డి, యానిమల్‌’ సినిమాల ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా విడుదల చేశాడు

దర్శక నిర్మాత మారుతి దగ్గర వర్క్‌ చేసిన రవి నంబూరి  (ChennaiLoveStory movie Director RaviNamburi)ఈ సినిమాకు డైరెక్షన్‌తో పాటుగా, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నాడు. ‘కలర్‌ఫోటో, బేబీ’ సినిమాలకు కథ అందించిన సాయిరాజేష్‌ ఈ చెన్నైలవ్‌స్టోరీ సినిమాకు కథ అందిస్తుండటం విశేషం. సాయి రాజేష్ (SaiRajesh) ఎస్‌ఎకేఎన్‌ (SKN) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా విడుదల చేసిన చెన్నైలవ్‌స్టోరీ గ్లింప్స్, ఇందులోని డైలాగ్స్‌ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిప్రేమ తోపేం కాదు..అంటూ ఈ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘తొలి ప్రేమ తోపెం కాదు…ఫస్ట్‌ లవ్‌ఫెయిల్‌ అయితే బెస్ట్‌ లవ్‌ ఎక్కడో మొదలవుతుంది’’ అంటూ కిరణ్‌ అబ్బవరం చెప్పే డైలాగ్స్‌ బాగున్నాయి. ఇక తెలుగు అమ్మాయి శ్రీగౌరి ప్రియ ఈ చెన్నైలవ్‌స్టోరీ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు.

ఇక గ్లింప్స్‌ వీడియోకు మణిశర్మ (MusicDirector Manisharma) మ్యూజిక్‌ నెక్ట్స్‌ లెవల్లో కుదిరింది. ప్రస్తుతానికైతే చెన్నైలవ్‌స్టోరీ సినిమాకు మంచి పాజిటివ్‌ వైబ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇదే వైజ్‌ రాబోయే కంటెంట్‌ రిలీజ్‌ల విషయంలోనూ కంటిన్యూ అయితే..‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమా సూపర్‌హిట్టే.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *