కళ్యాణీ ప్రియదర్శన్, నస్లెన్ కె గఫూర్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన మలయాళ సినిమా ‘లోక చాప్టర్1- చంద్ర (Kotha Lokah Chapter 1: Chandra). డొమినిక్ అరుణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ నిర్మాత. అయితే ఈ ‘లోక చాప్టర్1- చంద్ర (Kotha Lokah Chapter 1: Chandra)’ సినిమాను ‘కొత్త లోక చాప్టర్ 1 చంద్ర’గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మలయాళం, తెలుగు భాషలతో పాటుగా, ఇతర భాషల్లోనూ ఆగస్టు 29నే రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ హీరోగా కల్యాణీ ప్రియదర్శన్ నటించగా, సన్నీ అనే కీలక పాత్రలో నస్లెన్ యాక్ట్ చేశాడు. ఇంకా ఈ కొత్త లోక చాప్టర్1 సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నాడు. లేటెస్ట్‌గా ‘కొత్త లోక చాప్టర్1’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించారు. ఏదైనా సమస్యా?’
పెద్దాయన చెబుతారు
నీలో ఎలాంటి మార్పు లేదు కద అమ్మాయి’,
‘‘ఒక లో ఫ్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేయాలి’
‘ఏ సమస్యల్లోనూ జోక్యం చేసుకోకూడదు’,
సాధారణ లేడీ కాదు తను..చిత క్కోట్టేసింది నన్ను….
ఇటు వంటి డైలాగ్స్‌తో కొత్త లోక చాప్టర్ చంద్ర ట్రైలర్ అయితే ఆసక్తికరంగానే ఉంది. మరి..సినిమా ఎలా ఉంటుందో ఈ ఆగస్టు 29న థియేటర్స్‌లో చూడాలి. అయితే ఈ సినిమాలో దుల్కర్‌సల్మాన్, నివిన్ పౌలిలు అతిథి పాత్రల్లో నటించారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే…ఈ సినిమాకు మంచి మైలేజ్ వస్తుంది.