మారుతి నెక్స్ట్ హీరో అతనేనా..?

Kumar NA
1 Min Read

Web Stories

Director Maruthi: దర్శకుడు మారుతి, ప్రభాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను సైతం పూర్తిస్థాయిలో మెప్పించలేక, ఒక యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మారుతి తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై ఫిల్మ్ నగర్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. మొదటి భాగం రిలీజ్‌కు ముందే మారుతి ‘రాజా సాబ్ 2: సర్కస్ 1935′ పేరుతో సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు.

మొదటి పార్ట్ ఫలితం తర్వాత, ఈ సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అసలు ఉంటుందా లేదా? అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ గురించి మారుతి మౌనంగానే ఉన్నారు. గత కొద్ది రోజులుగా మారుతి తన తదుపరి చిత్రాన్ని మెగా హీరో వరుణ్ తేజ్‌తో ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని జోరుగా ప్రచారం సాగింది. ఈ రూమర్లు మరీ ఎక్కువ కావడంతో మారుతి సన్నిహిత వర్గాలు స్పందించాయి. వరుణ్ తేజ్‌తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు తేల్చి చెప్పారు. మారుతి చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటి? ఎవరితో ఉంటుంది? అనే వివరాలను ఆయనే నేరుగా వెల్లడిస్తారని,

అప్పటి వరకు పుకార్లను నమ్మవద్దని ఆయన టీమ్ స్పష్టం చేసింది. వరుణ్ తేజ్ ప్రాజెక్ట్ కేవలం పుకారు మాత్రమే (మారుతి టీమ్ ఖండించింది. ఒక భారీ చిత్రం నిరాశపరిచినప్పుడు దర్శకులు తదుపరి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. మారుతి కూడా తన తదుపరి ప్రాజెక్టు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu