ఓటీటీలోకి ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Kumar NA
1 Min Read

Web Stories

Champion Ott: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion). ‘పెళ్లి సందడి’ వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రోషన్ చాలా ఆచితూచి ఎంచుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ, నటుడిగా రోషన్‌కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రం జనవరి 29న స్ట్రీమింగ్ కానుం ది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ నెలాఖరున ఓటీటీలో వీక్షించవచ్చు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్వప్న దత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మలయాళ నటి అనస్వర రాజన్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులోని ‘గిర గిర’ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ లభించింది. సంతోష్ ప్రతాప్, అవంతిక, హైపర్ ఆది ఇతర కీలక పాత్రల్లో నటించారు (Telugu cinema).

సుమారు రూ. 45 కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 17 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, మిక్కీ జే మేయర్ సంగీతం మరియు రోషన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద అదృష్టం కలిసిరాకపోయినా, ఓటీటీలో ‘ఛాంయన్’ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. రోషన్ తన తదుపరి చిత్రాలతో సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు (Latest telugu cinema news).

Please Share
Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi