మహేశ్‌బాబు పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను భలేగా బ్యాలెన్స్ చేస్తుంటారు. సినిమాల షూటింగ్ గ్యాప్స్‌లో ఏ మాత్రం వీలుపడినా, విదే శాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లిపోతాడు. హాలీడేని ఎంజాయ్ చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
కానీ దర్శకుడు రాజమౌళితో మహేశ్‌బాబు ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు (Maheshbabu Movie update). అయితే రాజమౌళి ఫిల్మ్ మేకింగ్ స్కూల్ వేరు. ఎవరైనా హీరో తనతో ఓ మూవీ కమిటైయ్యారంటే…ఆల్మోస్ట్ తన మాట వినాల్సిందే.
మహేశ్‌బాబు షూటింగ్స్‌కు ఏ మాత్రం చిన్న గ్యాప్ దొరికినా విదేశాలకు వెళ్తారనే కంప్లైట్ ఉంది. అందుకెనెమో..తన సినిమా ప్రారంభమైన సమ యంలోనే మహేశ్‌బాబు పాస్‌పోర్ట్‌ను సీజ్ చేస్తున్నట్లుగా రాజమౌళి ఓ ఫోటోను షేర్ చేశాడు. అప్పట్లో అది వీపరితంగా వైరల్ అయ్యింది.
కాగా లేటెస్ట్‌గా తన పాస్‌పోర్ట్ తన చేతికి వచ్చిందని, మహేశ్‌బాబు ఎయిర్‌పోర్టులో చూపించారు. అలాగే ఫ్యామిలీతో కలిసి ఈ వేసవిలో ఫారిన్ ట్రిప్‌కు వెళ్లారు మహేశ్‌బాబు. సో…మహేశ్‌బాబు వద్ద రాజమౌళి పప్పులేమీ ఉండకలేదని తెలుస్తోంది (Maheshbabu Movie SSMB29 update)
ఇక సినిమాల విషయానికి వస్తే…మహేశ్‌బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా రెండు షెడ్యూల్స్ పూర్త యింది. తొలి షెడ్యూల్ ఒడిశాలో పూర్తి కాగా, రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూర్తయింది. మూడో షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనున్నారని తెలిసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాలు ఇతర లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్న ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథ అందించారు.