MaheshBabuSSMB29 Movie Leaked: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లోని మూవీపై (SSMB29) భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని గురించిన ఏ విషయమైనా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో సంచలనమైపోతుంది. ఈ మూవీ లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ ఒడిశాలోని కొరాపుట్ లొకేషన్స్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు, పృథ్వీరాజ్ సుకు మారన్, ప్రియాంకా చోప్రాలు పాల్గొంటుండగ, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి అండ్ కో.
నెట్టింట్లో వీడియో వైరల్
కానీ ఈ షూటింగ్ లొకేషన్ పిక్స్ మాత్రమే కాదు…లొకేషన్ సెట్, మహేశ్‌బాబు యాక్టింగ్ వీడియో… వంటివి సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో రాజమౌళి అండ్ టీమ్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. ఎంతో పకడ్భందీగా ఏర్పాట్లు చేసుకున్న, ఈ లీక్ టీమ్‌ను బాధపెడుతోంది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా, ఈ వీడియోను సోషల్‌మీడియాలోని కొన్ని అకౌంట్స్ నుంచి తొలగిస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది. ఈ వీడియో విషయంలో రాజమౌళి ఇక చేసేదీ ఏమీ లేదు. ఇలాంటి లీక్ మరోకటి బయటకు రాకుండా జాగ్రత్త తీసుకోవడం తప్ప.
జాగ్రత్తలు తీసుకున్నా…!
షూటింగ్‌కు మందు మహేశ్ లుక్ బయటకు రాకుండ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు రాజమౌళి. మూవీ ఓపెనింగ్ çసమయంలో కూడా పిక్స్ బయటకు రాలేదు. అవుట్డోర్ లొకేషన్ కావడం, అనుమతులు ఉన్నప్పటికీని, షూటింగ్ జరుగుతోంది పబ్లిక్ ప్లేస్ కాబట్టి…వీడియో బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ పీరియాడికల్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్‌ను దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఒడిశా తర్వాత ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ కెన్యాలో ఉండొచ్చన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తొలిభాగం 2027లో రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయన్నట్లుగా తెలుస్తోంది.