సినిమా: పోన్‌మ్యాన్ (Ponman Telugu Review)
ప్రధాన తారాగణం: బాసిల్ జోసెఫ్, లీజోమోల్ జోస్, ఆనంద్ మన్మధన్, సంధ్యా రాజేంద్రన్, దీపక్
దర్శకుడు: జోతీష్ శంకర్
నిర్మాణం: అజిత్ వినాయక ఫిల్మ్స్
సంగీతం: జస్టిన్ వర్గీస్
కథ
స్టేఫీ(లీజోమోల్ జోస్)కి మరియమ్ (సజిన్‌గోపు) పెళ్లి సెట్ అవుతుంది. కట్నంగా మగపెళ్లివారు 25 సెవర్ల బంగారం డిమాండ్ చేస్తారు. అంత బంగారంను ఏర్పాటు చేసే ఆర్థిక స్థితిగతులు స్టేఫీ కుటుంబానికి లేవు.స్టేఫీ అన్నయ్య బ్రూనో (ఆనంద్ మన్మధన్) రాజకీయాలు అంటూ అవారాగా తిరుగుతుంటాడు. రాజకీయపోస్టర్స్‌ను చించారనే కోపంతో ఓ చర్చి వ్యక్తితో గొడవ పడతాడు బ్రూనో. ఇక చెల్లి పెళ్లి కోసం ఏదో ఒకటి చేయాలని తన తల్లి (సంధ్యా రాజేంద్రన్) బ్రూనోపై ఒత్తిడి తీసుకురావడంతో, బ్రూనో మానసిక ఒత్తిడికి లోనవుతాడు. బ్రూనో ఇబ్బందిని గమనించి, అతని ఫ్రెండ్ మార్కండేయ (దీపక్ పరంబోల్) ఓ ప్లాన్ రెడీ చేస్తాడు.
గోల్డ్ సేల్స్ ఏజెంట్ రాజేషన్ (జోసెఫ్ బాసిల్)తో మార్కండేయ మాట్లాడతాడు. దీంతో పెళ్లికి ముందే 25 సవర్ల బంగారాన్ని స్టెఫీకి ఇస్తాడు అజేషన్. అయితే ఒప్పందం ప్రకారం…పెళ్లికి వచ్చిన చదివింపుల డబ్బు మొత్తాన్ని అజేషన్‌కు ఇవ్వాలి. కానీ చర్చి వ్యక్తితో బ్రూనో పెట్టుకున్న గొడవ కారణంగా స్టెఫీ పెళ్లికి పెద్దగా ఎవరూ రారు. దీంతో 12 సవర్ల బంగారానికి తగ్గ డబ్బు మాత్రమే చదింపుల రూపంలో అజేషన్‌కు వస్తుంది. దీంతో స్టేఫీ- బ్రూనోలతో గొడవ పడతాడు అజేషన్. ఎలాగైన 13 సవర్ల బంగారాన్ని తిరిగి ఇవ్వాలని పట్టుబడతాడు. కానీ మరియమ్ కారణంగా అజేషన్ తన బంగారాన్ని తిరిగి పొందేందుకు ఇబ్బందులు పడతాడు. మరి…అజేషన్ తన బంగారాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోగలిగాడు? స్టేఫీ, బ్రూనోలు ఎందుకు మారతారు? కట్నంగా వచ్చిన 25 సవర్ల బంగారంతో మరియమ్ ఏం ప్లాన్ చేశాడు? అన్న అంశాలతో ఈ సినిమా చాలా ఆసక్తికరంగాసాగుతుంది.
విశ్లేషణ
వంద అబద్దాలాడైన ఒక పెళ్లి చేయమని చెబుతుంటారు పెద్దలు. కానీ స్టేఫీ అమ్మ ఆడియన ఒక్క అబద్ధం ఎంతమంది జీవితాలను ఇబ్బంది పెట్టింది అన్నదే ఈ సినిమా కథనం. ఈ కథ చాలా సింపుల్. కానీదర్శకుడు ట్రీట్ చేసిన విధానం సూపర్భ్.
బ్రూనో గొడవతో సినిమా మొదలవుతుంది. స్టెఫీ పెళ్లితో కథ మొదలవుతుంది. అజేషన్ రాకతో కథలో వేగం పుంజుకుంటుంది. మరియమ్‌తో అజేషన్ గొడవతో సినిమా ముగుస్తుంది. ఈ పోన్‌మ్యాన్ సినిమాలోని గొప్పదనం ఏటంటే…సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కు ఓ స్ట్రగుల్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ నుంచి ఓసందేశం ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాగైన పోరాడాలి అని అజేషన్ క్యారెక్టర్ చెబుతుంది. ఓ అమ్మాయి జీవితం ఎలా ఇబ్బందు లుకు గురి అవుతుందో స్టేఫీ క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. రాజకీయ మత్తులో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో బ్రూనో క్యారెక్టర్ చెబుతుంది. ఓ అబద్దంతో జరిగే పెళ్లి నిలవదని స్టేఫీ తల్లి పాత్ర నుంచి అవగతం అవుతుంది. ఫ్రెండ్స్‌కు ఎలాగైనా హెల్ప్ చేయాలనే…మార్కేండేయ పాత్ర నుంచి స్నేహం కనిపిస్తుంది. ఓ మధ్యతరగతి అన్నగా తన చెల్లెల్ల జీవితాల కోసం మరియమ్ వ్యక్తిత్త్వంలో వచ్చే మార్పులు…ఇలా ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ బాగుంటుంది.
కానీ నిజాయితీ, పట్టుదల, కష్టం అని మాట్లాడే అజేషన్ ఎందుకు ఇల్లీగల్ గోల్డ్ ఏజెంట్‌గా ఉండాలి? కష్టాల్లో ఉన్న అజేషన్ అంతటి స్థాయిలో..తాగుబోతులా ఉండటం ఏమిటి? ఎవరో చెసిన తప్పుకు మరియమ్‌ను విలన్‌గా చూపించడంలో అర్థం ఏమిటి? ఓ ఫోన్‌కాల్ తర్వాత బ్రూనో ఆత్మహత్య చేసుకోవాలుకుంటాడు. ఆ ఫోన్‌కాల్ చేసింది ఎవరు? అన్న అంశాలకు క్లారిటీ ఉండదు. కానీ ఈ సినిమా నిడివి చాలా తక్కువ. కాబట్టి…వీటిని పట్టించుకునేంత సమయం ఆడియన్స్ ఇవ్వలేదు దర్శకుడు. సో…సినిమా బోర్ కొట్టదు. క్లైమాక్స్ కూడా మెప్పిస్తుంది.
పెర్ఫార్మెన్స్
అజేషన్‌గా బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ ఎప్పటిలానే మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే చిన్నపాటి యాక్షన్ పర్వాలే దనిపిస్తుంది. ఇక స్టేఫీగా లీజోమోల్ జోస్ అదరగొట్టారు. తొలిభాగంతో కాస్త ఇంపార్టెన్స్ తగ్గినా, సెకండాఫ్‌లో హీరోకు తగ్గ పోటాపోటీ రోల్ లీజోమోల్‌కు దక్కింది. మరియమ్‌గా సజిన్‌గోపు పాత్ర బాగానే ఉంది.కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో బాగానే చేశాడు. స్ట్రగుల్ అయ్యే మధ్యతరగతి యువకుడు బ్రూనోగా ఆనంద మన్మధన్ యాక్టింగ్ ఫర్వాలేదు. ఈ రోల్ సైలెంట్‌గా ఉన్నా, కథలో మంచి ఇంపార్టెన్స్ ఉంది. సంధ్యా రాజేంద్రన్, రాజేషన్ శర్మ తదితరులు …వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు. ఎస్ జాన్ వర్గీస్‌విజువల్స్, జస్టిన్ వర్గీస్ మ్యూజిక్, నిదిన్ ఎడిటింగ్ బాగున్నాయి. జోతీష్‌శంకర్ డైరెక్షన్ బాగుంటుంది. సముద్రం దగ్గర బిర్యానీని నీటి పాలుచేసేప్పుడు…బాసిల్–సంధ్యారాజేంద్రన్‌ల విజువల్ షాట్, క్లైమాక్స్‌లో బాసిల్ కోసం లీజోమోల్ జోస్ ఎదురు చూడటం….వంటి రెండు సీన్స్ చాలు…దర్శకుడిగా జోతీష్ ప్రతి భను చెప్పుకోవడానికి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ: పోన్‌మ్యాన్…చూడాల్సిన సినిమా
రేటింగ్: 3/5
డిస్నీ హాట్‌స్టార్‌లో పోన్‌మ్యాన్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
నాని నిర్మాణంలోని ప్రియదర్శి కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ రివ్యూ